మంచి ఫామ్‌లో ఉన్న భారత జట్టుకు ఈరోజు సెమీఫైనల్లో ఇంగ్లండ్ రూపంలో బలమైన
ప్రత్యర్థి ఎదురవుతోంది. ఆదివారం పాక్‌తో జరిగే ఫైనల్ ఎవరు ఆడాలో ఈరోజు
తేలిపోనుంది. బలాబలాలపరంగా చూస్తే ఇరు జట్లు సమఉజ్జీలుగానే కనిపిస్తున్నాయి.
అయితే నాకౌట్ సమరంలో ఉండే తీవ్ర ఒత్తిడిని అధిగమించి ఏ జట్టు పైచేయి
సాధిస్తుందనేది ఆసక్తికరంగా మారింది. ఇంగ్లండ్‌తో జరిగిన గత నాలుగు టి20
సిరీస్‌లను కూడా భారతే గెలిచింది. ఇందులో రెండు భారత్‌లో జరగ్గా, మరో రెండు
ఇంగ్లండ్‌లో జరగడం చూస్తే భారత్ ఆధిపత్యం భారీగానే ఉంది. మరి టీమిండియా
ఫైనల్ ఎలెవెన్ ఎలా ఉండబోతోంది? మొదటి మ్యాచ్ నుంచీ చూస్తే పెద్దగా
మార్పులేమీ జరగలేదు. ఒక మ్యాచ్‌లో అక్షర్ స్థానంలో హుడా, మరో మ్యాచ్‌లో
కార్తీక్‌కు బదులుగా పంత్ ఆడటం మినహా అంతా సాఫీగానే సాగిపోయింది. సెమీస్‌లో
కూడా ఈ విషయంలోనే టీమ్ తటపటాయిస్తోంది. బ్యాటింగ్‌లో అదనపు బలమంటూ అశ్విన్,
అక్షర్‌లను రెగ్యులర్‌గా ఆడిస్తున్నారు. అక్షర్ పెద్దగా ప్రభావం చూపడం లేదు
కూడా. ఒకరిని తప్పించి స్పెషలిస్ట్ లెగ్‌స్పిన్నర్ చహల్‌ను ఆడించేందుకు ఒక
ప్రత్యామ్నాయం అయితే ఉంది. కీపర్ విషయంలో కూడా అదే సందిగ్ధత కొనసాగుతోంది.
నిన్న ప్రెస్మీట్లో రోహిత్ ఓ హింట్ ఇచ్చాడు. ఇద్దరు కీపర్లనూ బరిలో దించే
అవకాశాన్ని పరిశీలిస్తున్నామన్నాడు.