టెన్నిస్ సూపర్ స్టార్ నొవాక్ జకోవిక్‌ను 19 ఏళ్ల హోల్గర్ రూన్ ఓడించాడు.
ప్యారిస్ మాస్టర్స్ టోర్నమెంట్లో అద్భుతంగా రాణించిన రూన్.. ఫైనల్‌కు తన
జర్నీలో ముగ్గురు టాప్ ప్లేయర్లను మట్టికరిపించాడు. టాప్-10లో ఉన్న నలుగురు
స్టార్ ప్లేయర్లు హ్యూబర్ట్ హ్యూర్కాజ్, ఆండ్రే రూబ్లెవ్, కార్లోస్ అల్కారెజ్,
ఫీలిక్స్ ఆగెర్ అలియాసైమ్లను ఓడించాడు. తొలి సెట్లో స్టార్ ప్లేయర్,
ఆరుసార్లు ప్యారిస్ ఛాంపియన్ జకోవిక్ పూర్తి ఆధిపత్యం చెలాయించాడు. జకో చేసిన
ఒక్క సర్వ్‌ను కూడా రూన్ అడ్డుకోలేకపోయాడు. అయితే ఆ తర్వాతి సెట్లో పరిస్థితి
తారుమారైంది. రెండో సెట్లో కాన్ఫిడెన్స్ పొందిన రూన్ విజయం సాధించాడు. ఫైనల్
సెట్లో జకో 3-1తో ఆధిక్యం సాధించాడు. అలాంటి సమయంలో జకో తొడ కండరాలు
పట్టేయడంతో ఫిజియోను పిలిచాడు. ఆ తర్వాత పుంజుకున్న రూన్ చివరకు ఆ సెట్‌ను
7-5తో ముగించాడు. దీంతో 3-6, 6-3, 7-5 తేడాతో రూన్ ఈ మ్యాచ్ గెలిచి టైటిల్ తన
సొంతం చేసుకున్నాడు.