పారా బ్యాడ్మింటన్ భారత దిగ్గజ క్రీడాకారుడు ప్రమోద్ భగత్ పారా బాడ్మింటన్
వరల్డ్ చాంపియన్‌షిప్‌లో అద్భుత ప్రదర్శన కనబరిచాడు. ఇటు సింగిల్స్, అటు
డబుల్స్‌లో ఫైనల్స్‌కు చేరాడు. సింగిల్స్ విభాగంలో జపాన్ క్రీడాకారుడు
డయాసుకి ఫుజిహరను 22-20, 21-14 తేడాతో వరుస సెట్లలో ప్రమోద్ భగత్ విజయం
సాధించాడు. ఫైనల్‌కు చేరాడు. ఫైనల్లో భారత్‌కు చెందిన నితీశ్ కుమార్‌తో
తలపడనున్నాడు. అటు డబుల్స్ విభాగంలో ప్రమోద్ భగత్, మనోజ్ సర్కార్‌తో కలిసి
ప్రత్యర్థి గులౌమి గైలీ- మాథ్యూ థామస్ జోడీపై 21-08, 21-16తేడాతో ఓడించాడు.
భగత్ జోడీ ఫైనల్‌కు చేరింది. ఆదివారంనాడు ఫైనల్లో ఇండోనేసియా జోడీ రాందాని-
ఉకున్ రన్కండితో తలపడనుంది. మరోవైపు వరల్డ్ నం.3 క్రీడాకారుడు సుకాంత్
కదమ్ సెమీఫైనల్లో ఇండోనేసియాకు చెందిన ఫ్రీడి సెటివాన్ చేతిలో 20-22, 15-21
తేడాతో పరాజయం పాలై టోర్నీ నుంచి నిష్క్రమించాడు.