24 ఫోర్లు 9 సిక్సర్లతో సూపర్ ఇన్నింగ్
భారత్ క్రికెట్ కంట్రోల్ బోర్డు బీసీసీఐ ఆధ్వర్యంలో ఈరోజు 5వ తారీఖున శనివారం
గోకరాజు గంగరాజు క్రికెట్ స్టేడియం మూలపాడు ఆంధ్ర క్రికెట్అసోసియేషన్ మైదానంలో
ఆంధ్ర హర్యానా జట్ల మధ్య అండర్ 19 కూచ్ బిహారి క్రికెట్ టోర్నమెంట్
ప్రారంభమైంది. మొదటిరోజు ఆంధ్ర హర్యానా జట్లు మధ్య జరిగిన పోటీలో టాస్ గెలిచి
ఆంధ్ర జట్టు బ్యాటింగ్ ఎంచుకున్నది. విజయవాడలో జరుగుతున్న అండర్ 19 కూచ్
బిహారి క్రికెట్ టోర్నమెంట్లో ఆంధ్ర జట్టు మొదటిరోజు 290 పరుగులు చేసి ఆల్
అవుట్ అయింది. 55.2 ఓవర్లలో ఆంధ్ర జట్టు మొదటి ఇన్నింగ్ ముగిసింది. ఆంధ్ర
జట్టు మిడిల్ ఆర్డర్ బ్యాట్స్ మెన్ మచ్చా దత్త రెడ్డి అద్భుత బ్యాటింగ్ చేసి
జట్టును ఆదుకున్నారు. ఒక దశలో హర్యానా బౌలర్లు దాటికి ఆంధ్ర జట్టు ప్రధానమైన
బ్యాట్స్మెన్లు 50 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో
కూరుకుపోయింది. మచ్చ దత్త రెడ్డి అద్భుతమైన బ్యాటింగ్ ప్రతిభతో ఆంధ్ర జట్టును
ఆదుకున్నారు.
హర్యానా బౌలర్ల స్పీడ్ కు బ్రేక్ వేశారు. మొదటి రోజు ఆంధ్ర మొదట ఇన్నింగ్ 290
పరుగులు చేయగలిగింది. మచ్చా దత్త రెడ్డి అద్భుతమైన బ్యాటింగ్ ప్రతిభతో
గ్రౌండ్ నలుమూలన ఫోర్లు సిక్సర్ల వర్షం కురిపించారు. మచ్చా దత్త రెడ్డి కేవలం
122 బంతుల్లో 172 పరుగులు సాధించి నాటౌట్ గా నిలిచారు. అందులో 24 ఫోర్లు 9
సిక్సర్లు ఉన్నాయి. ప్రముఖ ఉద్యమ నాయకుడు మచ్చా రామలింగారెడ్డి కుమారుడే
మచ్చా దత్త రెడ్డి దత్త రెడ్డి గ్రౌండ్ నలుమూలల అద్భుతమైన బ్యాటింగ్‌తో పరుగుల
వరద సృష్టించారు. మచ్చ దత్తారెడ్డి బ్యాటింగ్ లో 90 96 పరుగులు ఫోర్ ల రూపంలో
9 సిక్సర్లు 54 పరుగులు సిక్సర్లు రూపంలో లభించాయి 150 పరుగులు కేవలం ఫోర్లు
సిక్సర్లతో దత్తారెడ్డి సాధించారు. ఆంధ్ర ఇన్నింగ్‌లో రేవంత్ రెడ్డి 36
పరుగులు తేజ 33 పరుగులు సాధించారు. మిగిలిన ఆంధ్ర బ్యాట్స్‌మెన్ ఎవరు
రాణించలేకపోయారు. తర్వాత బ్యాటింగ్ చేసిన హర్యానా జట్టు మొదటి రోజు ఆట ముగిసే
సమయానికి 99 పరుగులు చేసి 33 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయింది. సోమవారం
రెండవ రోజు హర్యానా జట్టు బ్యాటింగ్ చేస్తోంది.కూచ్ బిహారీ అండర్ 19 క్రికెట్
పోటీలు డిసెంబర్ నెల రెండవ వారం వరకు దేశంలో వివిధ రాష్ట్రాల్లో పోటీలు
జరుగుతాయి. ఈ పోటీలలో ప్రతిభ చూపిన వారిని భారత అండర్ 19 జట్టుకు ఎంపిక
చేస్తారు.