కాగా ఈ మ్యాచ్‌లు చివరి అంకానికి చేరుకున్నాయి. సెమీఫైనల్ బెర్త్ కోసం జట్లు
అమీతుమీ తేల్చుకుంటున్నాయి. ఈ క్రమంలోనే ఒక్కొక్కటిగా కొన్ని జట్లు సెమీస్ కు
చేరుకుంటున్నాయి. ఈ తరుణంలోగ్రూప్-2 నుంచి రెండో సెమీస్ బెర్త్ ఖరారైంది.
బంగ్లాదేశ్‌పై సునాయాస విజయం సాధించిన పాకిస్తాన్ సెమీ ఫైనల్ పోరుకు
వెళ్లింది.
గ్రూప్-2 పాయింట్ల పట్టికలో 6 పాయింట్లతో పాక్ జట్టు నాకౌట్ కు చేరుకుంది.
బంగ్లాదేశ్ నిర్దేశించిన 128 పరుగుల లక్ష్యాన్ని 5 వికెట్లు కోల్పోయి మరో 11
బంతులు మిగిలుండగానే చేధించింది. ఓపెనర్లు మహ్మద్ రిజ్వాన్ (32), బాబర్
ఆజం(25) పరుగులతో మొదటి వికెట్‌కు 57 పరుగుల విలువైన భాగస్వామ్యాన్ని
అందించారు. ఆ తర్వాత వచ్చిన బ్యాటర్లు కాస్త ఇబ్బందిపడినట్టు కనిపించినా పాక్
విజయాన్ని బంగ్లాదేశ్ అడ్డుకోలేకపోయింది. కాగా తొలి బ్యాటింగ్ చేసిన
బంగ్లాదేశ్ బ్యాటింగ్‌లో అంతగా రాణించలేకపోయింది. ఓపెనర్ శాంటో 54 పరుగులు
చేసినప్పటికీ మిగతా బ్యాట్స్‌మెన్స్ కాస్త తడబడ్డారు. దానితో నిర్ణీత ఓవర్లలో
127 పరుగుల స్వల్ప స్కోరుకే బంగ్లా పరిమితమైంది. పాక్ బౌలర్లలో షాహీన్ అఫ్రిదీ
అత్యధికంగా 4 వికెట్లు తీశాడు. పాక్ బ్యాటర్లు మరియు బౌలర్లు అద్భుతమైన ఆటతీరు
కనపరిచారు. ఈ విధంగా ఎప్పుడో ఇంటి దారిపడుతుందని భావించిన పాక్ జట్టు సెమీస్
కు దూసుకువెళ్లింది.