ఫిట్నెస్కి, ఫీల్డింగ్‌కు పేరుగాంచిన విరాట్ కోహ్లీ ఫీల్డింగ్‌పై వివాదం నెలకొంది. ఆయనపై ఫేక్ ఫీల్డింగ్ ఆరోపణలు వచ్చాయి. ఆస్ట్రేలియాలో జరుగుతున్న టీ20 ప్రపంచకప్‌లో భారత్ చేతిలో ఓడిపోయిన తర్వాత బంగ్లాదేశ్‌కు చెందిన నూరుల్ అహ్మద్ ‘విరాట్ ఫేక్ ఫీల్డింగ్ చేశాడని’ ఆరోపించాడు. ఒకవేళ భారత్‌కు ఫేక్ ఫీల్డింగ్ కారణంగా పెనాల్టీ వచ్చి ఉంటే మ్యాచ్ సూపర్ ఓవర్లోకి వెళ్లి ఉండేది. ఎందుకంటే, ఫేక్ ఫీల్డింగ్‌పై 5 పరుగుల పెనాల్టీ ఉంది. టీమ్ ఇండియా అదే పరుగులతో గెలవడంతో.. ఫలితం చివరకు సూపర్ ఓవర్‌కు మారేది. అయితే, బంగ్లా కీపర్ నరూల్ చేసిన ఈ ఆరోపణ తర్వాత ఈ విషయం చర్చనీయాంశమైంది. 7వ ఓవర్లో లిటన్ దాస్ మొదటి బంతిని డీప్ బ్యాక్వర్డ్ స్క్వేర్ లెగ్ దిశలో ఆడాడు. అయితే, వికెట్ కీపర్ ఎండ్‌లో అర్ష్‌దీప్ బంతిని విసిరాడు. మధ్యలో కోహ్లి బంతిని పట్టుకుని నాన్ స్ట్రైక్ వైపు విసిరేస్తున్నట్లు కనిపించాడు. విరాట్ ఇలా చేస్తున్నప్పుడు పై ఫోటోలో కనిపిస్తున్న అంపైర్ దానిని పట్టించుకోలేదు. అప్పుడు అంపైర్ ముందు విరాట్ ఉన్నాడు. కానీ, నకిలీ ఫీల్డింగ్ పెనాల్టీ విధించడం అవసరమని అతను భావించలేదు. అయితే ఫీల్డ్ అంపైర్లు పెనాల్టీలు విధించవచ్చని ఐసీసీ కొత్త రూల్స్ చెబుతున్నాయి.
భారత్‌తో ఓడిపోయిన తర్వాత, బంగ్లాదేశ్ ఆటగాడు నూరుల్ అహ్మద్ మాట్లాడుతూ- ‘ఆన్-ఫీల్డ్ అంపైర్లు కోహ్లీ ఫేక్ ఫీల్డింగ్‌ను పట్టించుకోలేదని ఆరోపించాడు. ఆ నిర్ణయం బంగ్లాదేశ్‌కు అనుకూలంగా ఉంటే, అప్పుడు పరిస్థితి భిన్నంగా ఉండేది. నేల తడిగా ఉంది. దాని ప్రభావం అందరికీ కనిపించింది. ఆ త్రో నకిలీదని నేను అనుకున్నాను. జరిమానా విధించి ఉంటే మ్యాచ్ మాకు అనుకూలంగా ఉండేదేమో కానీ అలా జరగలేదు’ అంటూ చెప్పుకొచ్చాడు.