షకీబ్ మాట్లాడూతూ.. “భారత్తో మళ్లీ మాది పాత కథే. గెలుపునకు బాగా దగ్గరగా రావడం, ఆపై ఓడిపోవడం. ఇలాంటి ఉత్కంఠభరిత మ్యాచ్లు మేం ఎక్కువగా ఆడలేదు. అందుకే అలాంటి సమయంలో ఎలా గెలవాలో తెలీదు. అనుభవం లేకపోవడం కూడా ఒక కారణం. 185 అయినా 151 అయినా సాధించదగ్గ లక్ష్యమే. కానీ దురదృష్టవశాత్తూ మేం గెలవలేకపోయాం. చివరి 2 ఓవర్లలో 30 కూడా సాధ్యమే కానీ అది జరగలేదు. వాన ఆగిన తర్వాత మైదానం తడిగా ఉంది. కాబట్టి కాస్త ఆలస్యంగా ఆటను ప్రారంభించమని అంపైర్లను అడిగే స్థాయి నాకు లేదు. వర్షంతో మా జోరుకు అడ్డుకట్ట పడిందనేది వాస్తవం. అయితే సాధారణంగా మైదానం, బంతి తడిగా ఉన్నప్పుడు బౌలింగ్ జట్టుకే సమస్య. బ్యాటింగ్లో పరుగులు చేయడం సులువే కాబట్టి దానిని ఓటమికి సాకుగా చెప్పను” అని పేర్కొన్నాడు.