టీ20 ప్రపంచకప్‌లో బంగ్లాదేశ్‌పై టీమ్ఇండియా మంచి రికార్డ్ కలిగి ఉంది. ఈ కప్ లో భాగంగా బాధవారం టీమిండియా బంగ్లాదేశ్ తో తలపడనుంది. నవంబర్ 2వ తేదీ మధ్యాహ్నం 1.30 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభమవుతుంది. ఇందులో టీమిండియానే గెలిచే అవకాశాలుంటాయనడంలో ఎలాంటి సందేహంలేదు. గత రికార్డులూ ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. ఈ రెండు జట్ల మధ్య ఇప్పటివరకు 11 టీ20 మ్యాచులు జరగ్గా.. భారత్ 10 విజయాలు సాధించింది. బంగ్లా ఒక్క గెలుపుతో సరిపెట్టుకుంది.