విజయం సాధించింది. సొంతగడ్డపై రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్ లో
ఢిల్లీ క్యాపిటల్స్ 7 వికెట్ల తేడాతో ఘనంగా గెలిచింది. ఈ క్రమంలో 3 వికెట్లు
కోల్పోయిన ఢిల్లీ క్యాపిటల్స్ మరో 20 బంతులు మిగిలుండగానే గెలుపు తీరాలకు
చేరింది. 182 పరుగుల లక్ష్యాన్ని కేవలం 16.4 ఓవర్లలోనే అందుకుంది.
ఈ ఇన్నింగ్స్ లో ముఖ్యంగా చెప్పాల్సింది ఢిల్లీ ఓపెనర్ ఫిల్ సాల్ట్ గురించి.
సాల్ట్ కేవలం 45 బంతుల్లోనే 87 పరుగులు చేశాడు. ఈ ఇంగ్లీష్ బ్యాట్స్ మన్ 8
ఫోర్లు, 6 సిక్సులతో బెంగళూరు బౌలర్లను ఉతికారేశాడు. బెంగళూరు టీమ్ లో సిరాజ్,
హేజెల్ వుడ్, హసరంగ వంటి దిగ్గజ బౌలర్లు ఉన్నప్పటికీ సాల్ట్ విజృంభణ ఓ రేంజిలో
సాగింది.
ఢిల్లీ జట్టులో కెప్టెన్ డేవిడ్ వార్నర్ 22, మిచెల్ మార్ష్ 26 పరుగులు
చేయగా… రిలీ రూసో 35 బంతులతో అజేయంగా నిలిచాడు. ఆఖర్లో వచ్చిన అక్షర్ పటేల్
ఓ భారీ సిక్స్ బాది అలరించాడు. రూసో విన్నింగ్ షాట్ గా భారీ సిక్స్ కొట్టడంతో
ఢిల్లీ క్యాపిటల్స్ గెలుపు అందుకుంది.
ఆర్సీబీ బౌలర్లలో హేజెల్ వుడ్ 1, కర్ణ్ శర్మ 1, హర్షల్ పటేల్ 1 వికెట్ తీశారు.
గత మ్యాచ్ లో లక్నో సూపర్ జెయింట్స్ పై 126 పరుగుల స్వల్ప స్కోరును
కాపాడుకున్న బెంగళూరు జట్టు ఇవాళ 181 పరుగులను కాపాడుకోలేకపోయింది.
కాగా, ఢిల్లీ బ్యాటింగ్ కొనసాగుతున్న సమయంలో ఆ జట్టు కెప్టెన్ డేవిడ్ వార్నర్
కు ఆర్సీబీ బౌలర్ సిరాజ్ మద్య వివాదం చెలరేగింది.