ప్రతీకారం తీర్చుకుంది. మొహాలీలోని ఐఎస్ బింద్రా స్టేడియంలో జరిగిన
హైస్కోరింగ్ మ్యాచ్‌లో చెలరేగి ఆడింది. ఫలితంగా 215 పరుగుల విజయ లక్ష్యాన్ని
మరో ఏడు బంతులు మిగిలి ఉండగానే 4 వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది.
కెప్టెన్ రోహిత్ శర్మ (0) మారోమారు తీవ్రంగా నిరాశపరిచినా ఇషాన్ కిషన్,
సూర్యకుమార్ యాదవ్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయారు. ఇద్దరూ కలిసి పంజాబ్
బౌలర్లను చెడుగుడు ఆడేసుకున్నారు. దీంతో 200 పరుగుల పైచిలుకు లక్ష్యం
చిన్నబోయింది. ఇషాన్ కిషన్ 41 బంతుల్లో 7 ఫోర్లు, 4 సిక్సర్లతో 75 పరుగులు
చేయగా, సూర్యకుమార్ యాదవ్ 31 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్సర్లతో 66 పరుగులు చేసి
జట్టును గెలిపించారు. 9 మ్యాచుల్లో ముంబైకి ఇది ఐదో విజయం.
చివర్లో వీరద్దరూ అవుటయ్యాక గెలుపుపై పంజాబ్ ఆశలు పెంచుకున్నప్పటికీ టిమ్
డేవిడ్ 19 (10 బంతుల్లో 3 ఫోర్లు), హైదరాబాదీ బ్యాటర్ తిలక్ వర్మ 26 (10
బంతుల్లో ఫోర్, 3 సిక్సర్లు) పరుగులు చేసి జట్టుకు అద్వితీయ విజయాన్ని
అందించారు. పంజాబ్ బౌలర్లలో నాథన్ ఎల్లిస్‌కు రెండు వికెట్లు దక్కాయి. ఇషాన్
కిషన్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది.
అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ లియామ్ లివింగ్ స్టోన్, జితేశ్ శర్మ
వీర బాదుడుతో నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 214 పరుగుల భారీ స్కోరు
సాధించింది. లివింగ్ స్టోన్ 42 బంతుల్లో 7 ఫోర్లు, 4 సిక్సర్లతో 82, జితేశ్
శర్మ 27 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్లతో 49 పరుగులు చేశారు. కెప్టెన్ ధావన్
30, మాథ్యూ షార్ట్ 27 పరుగులు చేశారు. ముంబై బౌలర్లలో చావ్లాకు రెండు వికెట్లు
లభించాయి.