ఐపీఎల్ 2023లో 42 మ్యాచ్‌లు పూర్తయ్యాయి. ఇందులో 3 సెంచరీలు నమోదు కాగా.. 200
ప్లస్ స్కోర్స్ అయితే ఏకంగా 24 నమోదయ్యాయి. అంటే 42 మ్యాచ్‌లలోని 24
ఇన్నింగ్స్‌లు జట్లు స్కోర్లు 200 ప్లస్ దాటాయి. ఇక ఇప్పటివరకు ఏ సీజన్లోనూ ఈ
ఫీట్ జరగలేదు. ఇంతటి విధ్వంసానికి గత రికార్డులన్నీ కూడా ఒక్కసారిగా
బద్దలయ్యాయని చెప్పొచ్చు.
ఈ సీజన్లో దాదాపుగా ఏ బ్యాట్స్‌మెన్ కూడా తన వ్యక్తిగత మైలురాయిపై
దృష్టి సారించలేదు.ప్రత్యర్ధి జట్టును ఎదుర్కునే క్రమంలో తమ టీం స్కోర్ 200
దాటాలన్న ఉద్దేశంతో ఆకాశమే హద్దుగా చెలరేగిపోయారు. అందుకే ఈ ఐపీఎల్లో
ఇప్పటివరకు కేవలం 3 సెంచరీలు మాత్రమే నమోదు కావడం విశేషం. అలాగే జట్టు
స్కోర్స్ 200 దాటడానికి మరో కారణం.. స్టార్టింగ్, ఎండింగ్ కేకపుట్టించడమే.
ఎందుకంటే చాలా టీమ్స్ ఫస్ట్ పవర్ ప్లే, అలాగే లాస్ట్ డెత్ ఓవర్లను బాగా
సద్వినియోగం చేసుకున్నాయి.మరోవైపు అత్యధిక స్కోర్లు సాధించిన బ్యాటర్ల అందరి
స్ట్రైక్ రేట్ ఒకరిద్దరి మినహా మిగిలినవారిది దాదాపుగా 150 కంటే ఎక్కువే ఉంది.
ఈ ఫీట్ సాధించిన వారు సైతం ఓపెనర్లు, వన్ డౌన్ బ్యాటర్లే కావడం విశేషం.
అంతేకాకుండా ఈ సీజన్ భవిష్యత్తు మ్యాచ్‌ల్లో కూడా ఇంకా 200 ప్లస్
స్కోర్లు నమోదవుతాయని మాజీ క్రికెటర్లు చెబుతున్నారు. కాగా, ఈ సీజన్లో యశస్వి
జైస్వాల్(124), వెంకటేష్ అయ్యర్(104), హ్యారీ బ్రూక్(100) సెంచరీలు నమోదు
చేయగా.. అత్యధిక పరుగులు రాబట్టిన వీరుల లిస్టులో జైస్వాల్(428),
డుప్లెసిస్(422), కాన్వె(414), గైక్వాడ్(354), విరాట్ కోహ్లీ(333) మొదటి ఐదు
స్థానాల్లో ఉన్నారు.