టీమిండియా మాజీ క్రికెటర్ సురేశ్ రైనా అత్తామామాలను దారుణంగా హత్య చేసిన
దోపిడీ దొంగ, మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ పోలీసుల ఎన్కౌంటర్లో హతమయ్యాడు.
పోలీసుల కళ్లుగప్పి మూడేళ్లుగా తప్పించుకుని తిరుగుతున్న రషీద్ శనివారం ఉత్తర
ప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్ పోలీసుల కంటపడ్డాడు. ఈక్రమంలో పోలీసులు రషీద్‌ను
పట్టుకునేందుకు ప్రయత్నించగా అతను పోలీసులపై దాడికి యత్నించడంతో, ఈ ఎన్కౌంటర్
జరిగిందని పోలీసు ఉన్నతాధికారులు వివరించారు. వివరాల్లోకి వెళితే.. 2020
ఆగస్టు 19న పఠాన్‌కోట్ జిల్లాలోని తరైల్ గ్రామంలో సురైశ్ రైనా బంధువులను
కొందరు దోపిడీ దొంగలు హతమార్చారు. రైనా మామ అశోక్ కుమార్ ఇంట్లో
నిద్రిస్తున్న సమయంలో దాదాపు 12 మంది దోపిడీ దొంగలు ఇంట్లోకి ప్రవేశించి
దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన అశోక్ కుమార్ అక్కడికక్కడే మృతి
చెందగా, ఆయన భార్య ఆశారాణి, కుమారుడు కౌశల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ
కన్నుమూశారు. ఈ ఘటనలో మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. అప్పట్లో ఈ ఘటన పెను
సంచలనం సృష్టించింది. ఈ కారణంగానే సురేశ్ రైనా ఐపీఎల్ ఆడకుండానే యూఏఈ నుంచి
ఇండియాకు వచ్చేశాడు