ఐపీఎల్ 2023 తొలి మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌కి బిగ్ షాక్ ఇచ్చింది
గుజరాత్ టైటాన్స్. 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. అహ్మదాబాద్‌లోని
నరేంద్ర మోదీ స్టేడియంలో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై నిర్ణీత 20
ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 178 పరుగులు చేసింది.
179 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్ టైటాన్స్
బ్యాట్స్‌మెన్.. ఆరంభం నుంచి అదరగొట్టారు. 37 పరుగులకే తొలి వికెట్
సమర్పించుకున్న గుజరాత్ టీమ్.. ఆ తరువాత ఏమాత్రం తడబడకుండా స్కోర్ పెంచింది.
నిర్ణీత 20 ఓవర్లలో 4 బంతులు మిగిలి ఉండగానే.. 5 వికెట్ల తేడాతో లక్ష్యాన్ని
చేధించి విజయం సాధించింది గుజరాత్. శుభ్‌మన్ గిల్ – 63, విజయ్
శంకర్ – 27, వృద్ధిమాన్ సాహా – 25, సాయి సుదర్శన్ -22, రాహుల్ తెవాటియా – 15
పరుగులతో విజృంభించి ఆడటంతో గుజరాత్ గెలుపు ఈజీ అయ్యింది.ఇక సీఎస్కే తరపున
ఓపెనర్ రితురాజ్ గైక్వాడ్ అత్యధికంగా 92 పరుగులు చేశాడు. మరో బ్యాటర్ మొయిన్
అలీ 23 పరుగులు చేశాడు. గుజరాత్ తరపున మహ్మద్ షమీ, రషీద్ ఖాన్, అల్జారీ జోసెఫ్
తలో 2 వికెట్లు తీశారు. ఇక చెన్నై బౌలర్లలో రాజ్వర్ధన్ అత్యధికంగా 3 వికెట్లు
పడగొట్టాడు. రవీంద్ర జడేజా, తుషార్ దేశ్ పాండే చెరో వికెట్ తీసుకున్నారు.
మ్యాచ్ స్కోర్ సంక్షిప్తంగా
గుజరాత్ టైటాన్స్: 182/5, 19.2 ఓవర్లు. చెన్నై సూపర్ కింగ్స్: 178/2, 20
ఓవర్లు.