ఘన్ఘాస్, సావిటి బూర. 48 కేజీల విభాగం ఫైనల్ మ్యాచ్లో మంగోలియాకు చెందిన
లుత్సాయిఖాన్ అల్టాంట్సెగ్పై భారత్కి చెందిన బాక్సర్ నితు ఘన్ఘాస్ 5-0తో
ప్రత్యర్థిని మట్టి కరిపించి భారత్ కి గోల్డ్ మెడల్ అందించింది. ఆ తరువాత 81
కేజీల విభాగం ఫైనల్ మ్యాచ్లో చైనాకు చెందిన వాంగ్ లీనాపై సావీటీ బూరా విజయం
సాధించి మహిళల ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్షిప్లో భారత్కు రెండో గోల్డ్ మెడల్
అందించింది.
48 కేజీల విభాగంలో మంగోలియా పగిలిస్ట్ లుత్సాయిఖాన్తో నీతు ఘన్ఘాస్ పోరాటం
వన్ సైడ్ వార్ని తలపించినప్పటికీ.. 81 కేజీల విభాగంలో సావీటీ బూర, వాంగ్
లీనాల మధ్య బాక్సింగ్ పోరు హోరాహోరీగా కొనసాగింది. ఉత్కంఠభరితంగా సాగిన ఈ
పోరులో అంతిమంగా సావిటీ బూర స్వల్పంగా ఆదిక్య సాధించి 4-3 తేడాతో విజయం
సాధించింది. చివరి వరకు విజయం ఇరువురి మధ్య దోబూచులాడినప్పటికీ.. బూర
బాక్సింగ్ పంచ్ ముందు వాంగ్ లీనా తలవంచక తప్పలేదు.
ఉమెన్స్ వరల్డ్ బాక్సింగ్ ఛాంపియన్షిప్ టోర్నమెంట్ చరిత్రలో గోల్డ్ మెడల్
గెలిచిన ఆరో భారతీయ మహిళగా నీతూ ఘన్ఘాస్ నిలవగా.. ఏడో స్థానంలో సావీటీ బూర
నిలవడం విశేషం. మొత్తానికి ఈ టోర్నమెంట్లో రెండు వేర్వేరు కేటగిరీల్లో రెండు
గోల్డ్ మెడల్స్ భారత్ వశమయ్యాయి.