తేడాతో ఆస్ట్రేలియా టీమ్ అలవోకగా ఓడించేసింది. మ్యాచ్‌లో టాస్ ఓడి మొదట
బ్యాటింగ్ చేసిన టీమిండియా 26 ఓవర్లలో 117 పరుగులకే ఆలౌటవగా.. లక్ష్యాన్ని
కేవలం 11 ఓవర్లలోనే ఆస్ట్రేలియా టీమ్ వికెట్ నష్టపోకుండా ఛేదించేసింది.
ఆస్ట్రేలియాతో విశాఖపట్నం వేదికగా జరిగిన రెండో వన్డేలో భారత్ జట్టు ఓటమికి గల
కారణాన్ని కెప్టెన్ రోహిత్ శర్మ వెల్లడించాడు. వైజాగ్ వన్డేలో భారత్ ఓటమిపై
కెప్టెన్ రోహిత్ శర్మ మాట్లాడుతూ ‘‘మ్యాచ్‌లో తగినంత స్కోరుని బోర్డుపై
ఉంచలేకపోయాం. వరుసగా వికెట్లు చేజార్చుకోవడం దానికి ప్రధాన కారణం. ఫస్ట్‌లోనే
శుభమన్ గిల్ వికెట్ చేజారిన తర్వాత నేను, కోహ్లీ 30-35 పరుగుల్ని వేగంగా
చేశాం. కానీ.. ఆ తర్వాత నేను వికెట్ చేజార్చుకున్నా.. ఆ వెంటనే బ్యాక్ టు
బ్యాక్ వికెట్లు కోల్పోయాం. దాంతో టీమ్ వెనకడుగు వేసి.. మళ్లీ
పుంజుకోలేకపోయింది. 117 పరుగులు మాత్రమే చేసే పిచ్ కాదు ఇది.. కానీ మేము
తగినంత స్కోరు చేయలేకపోయాం’’ అని చెప్పుకొచ్చాడు
వైజాగ్ పిచ్ బ్యాటింగ్‌కి అనుకూలిస్తున్నట్లు కనిపించింది. కానీ.. ఎక్స్ట్రా
బౌన్స్ టీమిండియాని దెబ్బతీసిందన్నారు.