మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్)లో ముంబయి ఇండియన్స్ జైత్రయాత్ర
కొనసాగుతోంది. ఈ టోర్నీలో ముంబయి వరుసగా ఐదో విజయం నమోదు చేసింది. గుజరాత్
జెయింట్స్ తో జరిగిన మ్యాచ్ లో ముంబయి ఇండియన్స్ 55 పరుగుల తేడాతో నెగ్గి
పాంచ్ పటాకా మోగించింది. ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన ముంబయి నిర్ణీత 20
ఓవర్లలో 8 వికెట్లకు 162 పరుగులు చేసింది. అనంతరం లక్ష్యఛేదనకు దిగిన గుజరాత్
జెయింట్స్ 20 ఓవర్లలో 9 వికెట్లకు 107 పరుగులు మాత్రమే చేసి ఓటమిపాలైంది.
ముంబయి బౌలర్లలో నాట్ షివర్ 3, హేలీ మాథ్యూస్ 3, అమేలియా కెర్ 2, ఇస్సీ వాంగ్
1 వికెట్ తీసి గుజరాత్ ను దెబ్బకొట్టారు. గుజరాత్ జట్టులో హర్లీన్ డియోల్ 22,
కెప్టెన్ స్నేహ్ రాణా 20 పరుగులు చేశారు. డబ్ల్యూపీఎల్ లో ముంబయి ఇండియన్స్
జట్టు ఆ డిన ఐదు మ్యాచ్ ల్లోనూ నెగ్గి ఓటమన్నదే ఎరుగకుండా పాయింట్ల పట్టికలో
అగ్రస్థానంలో ఉంది.