టెస్ట్‌లో ఆస్ట్రేలియా కీలక వికెట్ కోల్పోయింది. కెప్టెన్ స్టీవ్ స్మిత్(135
బంతుల్లో 3 ఫోర్లతో 38) వికెట్‌ను చేజార్చుకుంది. మూడో సెషన్ ప్రారంభంలోనే
జడేజా బౌలింగ్‌లో స్మిత్ క్లీన్ బౌల్డ్ కావడం విశేషం. ఇక స్మిత్-జడేజా మధ్య
టామ్ అండ్ జెర్రీ పోరు కొనసాగుతూనే ఉంది. ఈ సిరీస్‌లో వరుసగా మూడోసారి
స్మిత్‌ను జడేజా పెవిలియన్ చేర్చాడు. దాంతో రెండో వికెట్‌కు నమోదైన 79 పరుగుల
భాగస్వామ్యానికి తెరపడింది. రవీంద్ర జడేజా వేసిన ఫ్లాటర్ డెలివరినీ ఆఫ్ సైడ్
ప్రయత్నం చేసిన స్మిత్.. బంతి అంచనా వేయడంలో విఫలమై క్లీన్ బౌల్డ్ అయ్యాడు.
బ్యాట్ ఎడ్జ్ తీసుకున్న బంతి వికెట్లను పడేసింది. ఈ వికెట్‌తో టీమిండియా బిగ్
పార్టనర్‌షిప్‌ను బ్రేక్ చేసింది.
స్మిత్ ఔటవ్వడంపై భారత అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. హమ్మయ్యా
జిడ్డుగాడు ఔటయ్యాడని కామెంట్ చేస్తున్నారు. స్మిత్ చాలా డేంజర్ బ్యాటరని,
ఇలాంటి ఫ్లాట్ వికెట్‌పై సెంచరీలతో చెలరేగుతాడని గుర్తు చేస్తున్నారు.
మొత్తానికి జడేజా భారత్‌కు మంచి బ్రేక్ త్రూ అందించాడని కితాబిస్తున్నారు.
స్మిత్ ఔటవ్వడంతో భారత ఆటగాళ్లతో పాటు అభిమానులు కూడా ఊపిరి పీల్చుకున్నారని
కామెంట్ చేస్తున్నారు.
ఇక టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన ఆసీస్‌కు ఓపెనర్లు ట్రావిస్ హెడ్(32),
ఉస్మాన్ ఖవాజా శుభారంభం అందించారు. తొలి వికెట్‌కు 61 పరుగులు జోడించిన అనంతరం
ట్రావిస్ హెడ్‌ను అశ్విన్ ఔట్ చేయగా.. లబుషేన్‌ను షమీ పెవిలియన్ చేర్చాడు. ఆ
తర్వాత క్రీజులోకి స్మిత్ రాగా.. ఉస్మాన్ ఖవాజా ఇన్నింగ్స్‌ను ముందుకు
నడిపించాడు. ఈ ఇద్దరూ భారత బౌలర్ల సహనానికి పరీక్షగా నిలిచారు. 146 బంతుల్లో
ఉస్మాన్ ఖవాజా హాఫ్ సెంచరీ పూర్తి చేసుకోగా.. స్మిత్(38 బ్యాటింగ్) అతనికి
అండగా నిలిచాడు. దాంతో ఆసీస్.. 149/2 స్కోర్‌తో సెకండ్ సెషన్‌ను ముగించింది.
మూడో సెషన్ ఆరంభంలోనే స్మిత్ ఔటవ్వగా.. క్రీజులోకి వచ్చిన పీటర్
హ్యాండ్స్‌కోబ్‌ను మహమ్మద్ షమీ క్లీన్ బౌల్డ్ చేశాడు. షమీ వేసిన గుడ్ లెంగ్త్
డెలివరీ హ్యాండ్ స్కోంబ్ హాఫ్ వికెట్‌ను లేపేసింది. నాలుగో వికెట్ పోయే
సమయానికి ఆసీస్ 170 పరుగులు చేసింది. క్రీజులోకి కామెరూన్ గ్రీన్ రాగా..
ఉస్మాన్ ఖవాజా భారత బౌలర్లపై ఎదురు దాడికి దిగుతూ సెంచరీ దిశగా
దూసుకెళ్తున్నాడు.