బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఇండోర్‌లో ఆసీస్‌తో జరిగిన మ్యాచ్‌లో
టీమిండియా స్పిన్ పిచ్ పై బోల్తా పడటం తెలిసిందే. అయితే ఈ పిచ్‌కు ఐసీసీ చెత్త
పిచ్ అనే రేటింగ్ ఇవ్వడంతో పిచ్‌లపై చర్చ మరో స్థాయికి చేరింది. తాజాగా మాజీ
కెప్టెన్ సునీల్ గవాస్కర్.. భారత జట్టుపై మండిపడ్డాడు. టీమ్ ఇండియా బౌలింగ్
బలంగా లేదు.. అందుకే ఇలాంటి పిచ్‌లు తయారు చేస్తున్నారంటూ మాజీ కెప్టెన్
సునీల్ గవాస్కర్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఇండియాలో 20 వికెట్లు తీయడం అంత
సులువు కాదని అన్నాడు. టీమ్ ఇండియా జట్టు బౌలింగ్ ఎటాక్ చాలా బలహీనంగా ఉందని..
అందుకే ఇలా స్పిన్ పిచ్‌లు తయారు చేయిస్తున్నారని అతడు అనడం గమనార్హం.
“డబ్ల్యూటీసీ ఫైనల్‌కు ఇండియా వెళ్లాలంటే వాళ్లకు ఇలాంటి స్పిన్ పిచ్‌లు
తయారు చేయడం తప్ప మరో మార్గం లేదు. బౌలింగ్ ఎటాక్ బలంగా ఉంటే మరో దారి
ఆలోచించవచ్చు. కానీ, మీ ప్రధాన బలం స్పిన్నర్లే. అందుకే ఇలాంటి పిచ్ లు తయారు
చేస్తున్నారు. ఫ్లాట్ పిచ్ లు తయారు చేస్తే బ్యాటర్లు డామినేట్ చేస్తారు.
కానీ, ఈ పిచ్ లు బ్యాటర్లకు పరీక్ష పెడుతున్నాయి” అని గవాస్కర్
అభిప్రాయపడ్డాడు.