పాకిస్థాన్ మాజీ క్రికెటర్ ఒకరు ‘జై శ్రీరామ్’ అంటూ చేసిన ట్వీట్ ఒకటి వైరల్
అవుతోంది. డానిష్ కనేరియా.. పాకిస్థాన్ క్రికెట్ జట్టుకు గతంలో ఆడిన హిందూ
ఆటగాడు. పాక్లో క్రికెట్ జట్టుకు ఎంపికైన రెండో హిందూ వ్యక్తి. ఇప్పుడు అతడు
చేసిన ఓ పోస్టు చర్చనీయాంశంగా మారింది. ‘జై శ్రీరామ్ ప్రభూ..’ అంటూ ట్వీట్
చేయడమే అందుకు కారణం. హిందువు అయుండి, జై శ్రీరామ్ అంటే ప్రత్యేకత ఏముందీ
అనుకోవచ్చు. అయితే, అతడు పాకిస్థానీ కావడం ఒక అంశమైతే, భారత్లో నరేంద్ర మోదీ
సారథ్యంలోని బీజేపీ ప్రభుత్వ హయాంలో గత దశాబ్ద కాలంగా పెద్ద ఎత్తున
వినిపిస్తున్న నినాదాన్ని ఎత్తుకోవడం రెండో అంశం. అంతేకాదు, ‘ఈ
విశ్వానికంతటికీ మీరే (శ్రీరామచంద్రమూర్తి) శక్తి. మీరు లేకుండా ఏదీ లేదు’ అని
కనేరియా రాసుకొచ్చాడు. అయోధ్యలో రామమందిర నిర్మాణ పనులు యుద్ధ ప్రాతిపదికన
కొనసాగుతున్న వేళ.. పాక్ మాజీ స్పిన్నర్ కనేరియా చేసిన పోస్టు ప్రాధాన్యం
సంతరించుకుంది. కనేరియా పోస్టుకు హర్షం వ్యక్తం చేస్తూ రామభక్తులు పెద్ద
ఎత్తున కామెంట్లు పెడుతున్నారు. జై శ్రీరామ్ అంటూ పాకిస్థాన్ మాజీ క్రికెటర్
చేసిన ఈ ట్వీట్ ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది. డానిష్ కనేరియా పాకిస్థాన్
క్రికెట్ జట్టుకు ఆడిన హిందూ ఆటగాడిగా పేరొందాడు.