మార్చి 15 నుంచి న్యూఢిల్లీలో జరగనున్న మహిళల బాక్సింగ్ ప్రపంచ
ఛాంపియన్‌షిప్‌కు మరికొన్ని రోజులు మిగిలి ఉండగానే భారత బాక్సింగ్ సమాఖ్య
(బీఎఫ్ఐ) ఎంపిక వివాదంలో చిక్కుకుంది. 54 కేజీల విభాగంలో తనను జట్టు నుంచి
మినహాయించడంపై బీఎఫ్ఐకి జాతీయ ఛాంపియన్ శిక్షా నర్వాల్ లేఖ రాసింది. ఆమె
“అన్ని ప్రమాణాలను పూర్తి చేసి జట్టులో స్థానానికి అర్హురాలిని” అని
పేర్కొంది. ఒలింపిక్ బరువు 54 కేజీల విభాగంలో ప్రీతి ఎంపికైంది. దీనిపై శిక్ష
తీవ్ర అభ్యంతరం తెలిపింది. జాతీయ ఛాంపియన్‌షిప్‌లో తాను ప్రీతిని
ఓడించినట్లు శిక్షా తన లేఖలో పేర్కొంది. “నేను ఒక్క రోజు కూడా మిస్ కాకుండా
క్రమం తప్పకుండా శిక్షణ చేస్తున్నాను. నేను పూర్తిగా ఫిట్‌గా ఉన్నాను. అయితే
ఎటువంటి కారణం లేకుండా ప్రపంచ ఛాంపియన్‌షిప్‌ల నుంచి నా పేరు తొలగించబడింది”
అని ఆమె ఉన్నత అధికారులకు లేఖ రాసింది. తన ప్రతిభకు అనుగుణంగా ప్రపంచ
ఛాంపియన్‌షిప్‌లో దేశానికి ప్రాతినిధ్యం వహించే అవకాశం ఇవ్వాలని
కోరుకుంటున్నానని ఆమె లేఖలో పేర్కొనింది .