తనపై వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణలపై దర్యాప్తు చేసేందుకు ప్రభుత్వం
నియమించిన పర్యవేక్షణ కమిటీ ఎదుట రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా
(డబ్ల్యూఎఫ్ఐ) చీఫ్ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ హాజరయ్యారు. దాదాపు మూడు గంటల
పాటు సాగిన విచారణకు బ్రిజ్ భూషణ్ తన 20 మంది మద్దతుదారులతో వచ్చారు. “బ్రిజ్
భూషణ్ మంగళవారం కమిటీ ఎదుట హాజరయ్యాడు. అతను వెంటనే అన్ని ఆరోపణలను ఖండించాడు.
అతను ఎప్పుడూ తప్పు చేయలేదని చెప్పాడు” అని క్రీడా మంత్రిత్వ శాఖ వర్గాలు
తెలిపాయి. అయితే బ్రిజ్ భూషణ్, ఇక్కడి SAI ప్రధాన కార్యాలయంలో వేచి ఉన్న
మీడియాకు చిక్కకుండా తప్పించుకున్నాడు. దర్యాప్తు ఇంకా కొనసాగుతోందని, ఈ
సమయంలో తాను ఎటువంటి వ్యాఖ్య చేయడానికి ఇష్టపడను అని చెప్పాడు. వినేష్ ఫోగట్,
బజరంగ్ పునియా, సాక్షి మాలిక్, రవి దహియా వంటి ప్రముఖ రెజ్లర్లు ఈ ఆరోపణలు
చేశారు.