రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (డబ్ల్యూఎఫ్ఐ) వర్సెస్ రెజ్లర్ల వివాదానికి
ముగింపు సంకేతాలు కనిపించడం లేదు. బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌పై వచ్చిన ‘లైంగిక
వేధింపుల’ ఆరోపణలపై దర్యాప్తునకు విచారణ కమిటీని ఏర్పాటు చేసినప్పటికీ, ఈ
విషయంలో ఎటువంటి పురోగతీ లేదు. వాస్తవానికి ఇప్పుడు బ్రిజ్ భూషణ్‌ను రెజ్లింగ్
బాడీ నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తున్న రెజ్లర్లలో ఒకరైన వినేష్ ఫోగట్
తాజాగా చేసిన ఆరోపణ సంచలనం కలిగించింది. దర్యాప్తు కమిటీ పర్యవేక్షక సభ్యులు
ఒకరు పత్రికలకు ‘సున్నితమైన సమాచారాన్ని’ లీక్ చేస్తున్నారని ఫోగట్
పేర్కొన్నారు. ఆ వ్యక్తిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఫోగట్
ట్విట్టర్లో చేసిన ఒక పోస్ట్‌లో.. పర్యవేక్షణ కమిటీలోని ఒక నిర్దిష్ట సభ్యుడు
ఫిర్యాదులోని విషయాలను మీడియాకు లీక్ చేశారని ఆరోపించారు.
“నిన్నటి నుంచి కొన్ని మీడియా నివేదికలను చదువుతూ లైంగిక వేధింపుల
ఫిర్యాదులోని విషయాలను పర్యవేక్షక కమిటీలోని సభ్యులు లీక్ చేస్తున్నారని
ఆరోపిస్తున్నట్లు నాకు ఇటీవల అవగాహన వచ్చింది. క్రీడాకారులుగా తోటి
క్రీడాకారులను ఇలా చూడటం చాలా నిరుత్సాహపరుస్తుంది. పర్యవేక్షక కమిటీ సభ్యులు
చాలా నిర్లక్ష్యంగా ప్రవర్తించారు. మహిళల పట్ల వారి దృక్పథం అటువంటి ప్రవర్తన
నుంచి స్పష్టంగా కనిపిస్తుంది” అని ఆమె రాశారు.