ప్రస్తుతం జరుగుతున్న క్రికెట్ సిరీస్ లలో టీమిండియాకు వైస్ కెప్టెన్‌ను
నియమించడాన్ని తాను వ్యతిరేకిస్తానని మాజీ కెప్టెన్, కోచ్ రవిశాస్త్రి
వ్యాఖ్యానించాడు. ఇక్కడి సిరీస్ లకు వైస్ కెప్టెన్ ఎంపికే అనవసరమని అన్నాడు.
స్వదేశంలో జరుగుతున్న బోర్డర్-గవాస్కర్ సిరీస్ లో ఇప్పటికే రెండు టెస్టుల్లో
వైస్ కెప్టెన్ కేఎల్ రాహుల్ ఏమాత్రం రాణించలేకపోయాడు. ఈ క్రమంలో మిగిలిన
రెండు టెస్టులకు జట్టును ప్రకటించిన బీసీసీఐ.. రాహుల్‌ను మళ్లీ తీసుకుంది.
అయితే, అతని పక్కన వైస్ కెప్టెన్ ట్యాగ్‌ను తొలగించిన బోర్డు.. ఆ బాధ్యతలను
ఎవరికీ అప్పగించలేదు. దీంతో ఇప్పుడు మిగిలిన రెండు మ్యాచ్‌లకు ఉప సారథి ఎవరన్న
దానిపై ఆసక్తి నెలకొంది.
ఇదే విషయమై శాస్త్రి మాట్లాడుతూ.. ’స్వదేశంలో జరిగే సిరీస్ లలో భారత
జట్టుకు వైస్ కెప్టెన్ ఎంపికే వద్దని నేనెప్పుడూ అనుకుంటా. ఎందుకంటే, వైస్
కెప్టెన్ ఫామ్‌లో లేనప్పుడు జట్టు ఎంపిక చాలా క్లిష్టతరమవుతుంది. అదే,
విదేశాల్లో పర్యటించినప్పుడు ఇది కాస్త భిన్నంగా ఉంటుంది. ప్రస్తుతం రాహుల్
ఎలా ఆడుతున్నాడు.. అతని మానసిక స్థితి ఎలా ఉందన్నది జట్టు మేనేజ్మెంట్కు
తెలుసు. శుభ్‌మన్ గిల్ మంచి ఫామ్‌లో ఉన్నాడు. అతడిని ఎలా వాడుకోవాలన్నదానిపై
మేనేజ్మెంట్ ఇప్పటికే పూర్తి స్పష్టతతో ఉంది’ అని అన్నాడు. జట్టులో
రాణించాలంటే ఆటగాడు నిలకడగా రాణించాల్సి ఉంటుందనీ, ఫామ్‌లో లేకపోతే ఆటగాళ్లు
కొన్నిరోజులు విరామం తీసుకుంటే మంచిదని శాస్త్రి చెప్పుకొచ్చాడు. విరామం
తర్వాత జట్టులోకి అడుగుపెడితే నూతనోత్సాహంతో వాళ్లు మళ్లీ సత్తా
చాటుతారన్నాడు. తాను కోచ్‌గా ఉన్నప్పుడు ఓసారి పుజార, రాహుల్‌ను ఫామ్‌లేమితో
తప్పించినా.. తర్వాత జట్టులోకొచ్చి అద్భుతంగా రాణించారని రవి శాస్త్రి
గుర్తుచేశాడు.