భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్‌ఎస్‌ఐ) అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్‌పై వచ్చిన
లైంగిక వేధింపుల ఆరోపణలపై ఏర్పాటైన పర్యవేక్షణ కమిటీ విచారణ గడువును కేంద్ర
క్రీడా మంత్రిత్వ శాఖ పొడిగించింది. విచారణ నివేదికను సమర్పించడానికి మరో
రెండు వారాల సమయం కేటాయించింది. మహిళా రెజ్లర్లను లైంగికంగా వేధిస్తున్నాడని,
అథ్లెట్లను బెదిరిస్తున్నాడంటూ అగ్రశ్రేణి క్రీడాకారులు గత నెలలో ఆందోళన
చేపట్టారు. ఆరోపణలపై దర్యాప్తు చేయడానికి క్రీడా శాఖ మేరీ కోమ్ నేతృత్వంలో
జనవరి 23న కమిటీని ఏర్పాటు చేసింది. డబ్ల్యూఎఫ్‌ఎస్‌ఐ రోజువారీ కార్యకలాపాలు
నిర్వహిస్తున్న కమిటీని నాలుగు వారాల్లో నివేదిక సమర్పించాలని కోరింది. కమిటీ
సభ్యుల విజ్ఞప్తి మేరకు ప్రస్తుతం క్రీడా శాఖ గడువు పొడిగించింది. పర్యవేక్షక
కమిటీ మార్చి 9న తన నివేదికను సమర్పించనుంది. బ్రిజ్ భూషణ్ ను తొలగించాలని
డిమాండ్ చేస్తూ ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద బజ్రంగ్ పునియా, వినేశ్ ఫోగాట్,
రవి దహియా, సాక్షి మలిక్ తో సహా అగ్రశ్రేణి రెజ్లర్లు నిరసన తెలపడంతో క్రీడా
శాఖ దిగి వచ్చి కమిటీని ఏర్పాటు చేయక తప్పలేదు.