ఇటీవల జరిగిన మహిళల ప్రీమియర్ లీగ్ వేలంలో అత్యధిక ధర పలికిన స్మృతి మంధానను
కెప్టెన్‌గా ఆర్సీబీ నియమించింది. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ఐపీఎల్ పురుషుల
ఆర్సీబీ జట్టు కెప్టెన్ డుప్లెసిస్ ప్రకటించారు. ఆమెకు ఆల్ ది బెస్ట్ తెలిపారు.
మహిళల ప్రీమియర్ లీగ్ తొలి ఎడిషన్ వేలంలో టీమ్ఇండియా ప్లేయర్ స్మృతి మంధానను
రికార్డు స్థాయిలో రూ.3.4 కోట్లకు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు
దక్కించుకుంది. ఇప్పుడు ఈ క్రికెట్ బ్యాటీనే ఆ ఫ్రాంచైజీ జట్టు కెప్టెన్‌గా
నియమించింది. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా జట్టు యాజమాన్యం ప్రకటించింది. “ఒక
నంబర్ 18 నుంచి మరొకరు.. ఒక కెప్టెన్ నుంచి మరొకరు.. విరాట్ కోహ్లీ,
డుప్లెసిస్ డబ్ల్యూపీఎల్ ఆర్సీబీ కెప్టెన్‌గా స్మృతి మంధానను ప్రకటించారు” అని
యాజమాన్యం ఓ వీడియో పోస్టు చేసింది. ఆ వీడియోలో ఐపీఎల్ బెంగళూరు జట్టు మాజీ
కెప్టెన్ విరాట్ కోహ్లీ, ప్రస్తుత కెప్టెన్ ఫాప్ డుప్లెసిస్ తమ అనుభవాల
గురించి మాట్లాడారు. స్మృతి మంధానను కెప్టెన్‌గా ప్రకటించారు. అనంతరం ఆమెను
కెప్టెన్స్ క్లబ్‌కు పరిచయం చేశారు. కాగా, ఐపీల్లో విరాట్ కోహ్లీ జర్సీ నెంబర్
18. ఇప్పుడు డబ్ల్యూపీఎల్‌లో మహిళల జట్టుకు సారథ్యం వహించబోతున్న స్మృతి మంధాన
జెర్సీ నంబర్ కూడా 18 కావడం గమనార్హం.
100 శాతం ప్రయత్నిస్తాను: స్మృతి మంధాన
“హాయ్..నేను స్మృతి మంధాన. నేను మహిళల ప్రీమియర్ లీగ్‌లో ఆర్సీబీ జట్టుకు
కెప్టెన్. విరాట్ కోహ్లీ, డుప్లెసిస్ ఆర్సీబీకి సారథ్యం వహించడం గురించి
చెప్పిన విషయాలు చూసి చాలా గ్రేట్ ఫీలింగ్ కలిగింది. ఇలాంటి గొప్ప అవకాశం
ఇచ్చిన ఆర్సీబీ యాజమాన్యానికి ధన్యవాదాలు చెప్పాలనుకుంటున్నా. ఫ్యాన్స్ అందరూ
మీ ప్రేమాభిమానాలను నాపై ఇలాగే చూపిస్తారని ఆశిస్తున్నాను. ఆర్సీబీని విజయ
తీరాలకు నడిపించడానికి 100 శాతం కృషి చేస్తాను” అని స్మృతి మంధాన
చెప్పుకొచ్చింది.
బెంగళూరు జట్టు మాజీ సారధి విరాట్ కోహ్లీ కూడా మాట్లాడాడు. ఆర్సీబీకి 10 ఏళ్లు
సారథ్యం వహించడం తన జీవితంలో మరిచిపోలేని ఒక ఫేజ్ అని అన్నాడు. కెప్టెన్ అంటే
గ్రూప్‌నకు లీడర్ మాత్రమే కాదని.. అందరి రెస్పెక్ట్ను పొంది.. లిగసీని ముందుకు
తీసుకెళ్తాడని చెప్పాడు. గతేడాది కెప్టెన్‌గా డుప్లెసిస్ జట్టును అద్భతంగా
నడిపంచాడని కొనియాడాడు. అనంతరం ఆర్సీబీ కెప్టెన్‌గా మంధానను ప్రకటించాడు. ‘నీకు
బెస్ట్ టీమ్, బెస్ట్ ఫ్యాన్స్ సపోర్టుగా ఉన్నారు’ అని చెప్పాడు. అనంతరం
డుప్లెసిస్ మాట్లాడి మంధానకు ఆల్‌ది బెస్ట్ చెప్పాడు.