టీమిండియా ఆటగాడు చతేశ్వర్ పుజారా అరుదైన ఘనత సాధించేందుకు అడుగు దూరంలో
నిలిచాడు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఈ నెల 17న ఢిల్లీలో ప్రారంభం
కానున్న రెండో టెస్టులో మైదానంలోకి అడుగుపెట్టడంతోనే ఇండియన్ క్రికెటర్ల ఎలైట్
లిస్టులో చోటు సంపాదించుకుంటాడు. ఇది అతడికి 100వ టెస్టు. ఫలితంగా వంద
టెస్టులు ఆడిన 13వ భారతీయ ఆటగాడిగా ఎలైట్ జాబితాలోకి ఎక్కుతాడు. అంతేకాదు,
ప్రస్తుత భారత జట్టులో ఆ ఘనత సాధించిన రెండో క్రికెటర్ అవుతాడు. గతేడాది
మార్చిలో మొహాలీలో శ్రీలంకతో జరిగిన టెస్టులో కోహ్లీ వందో టెస్టు ఆడేశాడు.
ఇప్పుడు పుజారా ఆ ఘనత అందుకోనున్నాడు.
“నేను నా కోసం లక్ష్యాన్ని నిర్దేశించుకోవడం ఇష్టం లేదు. నేను ప్రస్తుతం
ఉండాలనుకుం టున్నాను. నేను ఎంతకాలం ఆడగలనని ఆలోచించడం కంటే ఒకేసారి ఒక టెస్ట్
మ్యాచ్లో పాల్గొనాలనుకుం టున్నాను. నాకు ఇప్పుడే 35 ఏళ్లు వచ్చాయి. ఇంకా కొంత
సమయం ఉంది” అని పుజారా చెప్పాడు.