టీమిండియాతో జరిగిన తొలి టెస్టులో ఆస్ట్రేలియా జట్టు ఘోరంగా ఓడింది. ఇన్నింగ్
తో పాటు 132 పరుగుల తేడాతో ఓడిపోవడాన్ని ఆస్ట్రేలియా మీడియా జీర్ణించుకోలేక
పోతోంది. ఆసీస్ టీమ్ పై దారుణంగా విమర్శలు చేస్తోంది. ఈ ఓటమిని ‘అవమానకరమైన
ఓటమి’గా అభివర్ణిస్తోంది. రెండో టెస్టుకు మార్పులతో బరిలోకి దిగాలని
సూచించింది. స్పిన్ తో ఆసీస్ కు చుక్కలు చూపించిన అశ్విన్, రవీంద్ర జడేజాలపై
అక్కడి మీడియా ప్రశంసలు కురిపిస్తోంది. రెండో ఇన్నింగ్స్ లో కేవలం 91 పరుగులకే
ఆలౌట్ కావడంపై నాగ్ పూర్ టెస్టులో పాట్ కమిన్స్ జట్టు అవమానానికి గురైంది అంటూ
ఆస్ట్రేలియన్ బ్రాడ్ షీట్ రాసింది. ప్రత్యర్థి జట్టు 400 పరుగులు చేసిన చోట
ఆస్ట్రేలియా తడబడిందని.. దీనికి పిచ్ ను నిందించాల్సిన అవసరం లేదని పేర్కొంది.
ట్రావిస్ హెడ్ ను తుది జట్టులోకి తీసుకోకపోవడంపై తెలివితక్కువ పనిగా డైలీ
టెలిగ్రాఫ్ పేర్కొంది.ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్లో 91 పరుగులు చేయడం
భారత్లో అత్యల్ప స్కోరు. “మొదటి నాగ్పూర్ టెస్ట్ మ్యాచ్లో పాట్ కమిన్స్
జట్టు అవమానానికి గురైంది” అని ఆస్ట్రేలియన్ బ్రాడ్షీట్ రాసింది. ది సిడ్నీ
మార్నింగ్, హెరాల్డ్ ఆస్ట్రేలియా అయితే “ప్రపంచ ఆధిపత్యం కోసం తన అన్వేషణలో
క్రూరమైన వాస్తవిక తనిఖీని ఆసీస్ ఎదుర్కొంది. మార్నస్ లబుషేన్, స్టీవ్ స్మిత్,
అలెక్స్ క్యారీలకు మంచి ఆరంభాలు లభించాయి. కానీ, వాటిని భారీ స్కోర్లుగా
మలచడంలో వారందరూ విఫలమయ్యారు. ఇక ఓపెనర్లు ఉస్మాన్ ఖవాజా, డేవిడ్ వార్నర్
ఇద్దరూ ఏమాత్రం ఆకట్టుకోలేదు. ఈ క్రమంలో ఆసీస్ జట్టు పై పలువురు మాజీ ఆటగాళ్లు
విమర్శలు గుప్పిస్తున్నారు.’ అని విశ్లేషించాయి.