దక్షిణాఫ్రికాలో జరుగుతున్న మహిళల టీ20 ప్రపంచకప్‌లో భారత్ బోణీ
కొట్టింది. పాకిస్థాన్‌పై ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించింది. జెమీమా
రోడ్రిగ్స్ అర్థ సెంచరీ(53 నాటౌట్) తో జట్టును గెలిపించింది. ఫాతిమా సనా
వేసిన 19వ ఓవర్లో జెమీమా రోడ్రిగ్స్ మూడు ఫోర్లు బాదింది. దాంతో, ఒక ఓవర్
మిగిలి ఉండగానే భారత్ విజయం సాధించింది. జెమీమా, రీచా ఘోష్ (31) నాలుగో
వికెట్‌కు 58 రన్స్ జోడించారు. వీరోచితంగా ఆడి జట్టును గెలిపించిన జెమీమ
ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకుంది. 150 పరుగుల లక్ష్యంతో
బ్యాటింగ్‌కు దిగిన భారత్‌కు షషాలీ వర్మ, యస్తిక భాటియా శుభారంంభం
ఇచ్చారు. వీళ్లిద్దరూ తొలి వికెట్‌కు 31 రన్స్ జోడించారు. అయితే.. నశ్ర
సంధు షఫాలీ (33), హర్మన్‌ప్రీత్ కౌర్ (16)లను ఔట్ చేసి ఇండియాను పాక్
ఒత్తిడిలోకి నెట్టింది. అయితే.. జెమీమాతో జత కలిసిన రీచా స్కోర్ బోర్డును
పరుగులు పెట్టించింది. సాధించాల్సిన రన్‌రేటు 10 పైనే ఉండడంతో వీళ్లు
ధాటిగా ఆడారు. నశ్ర సంధు రెండు వికెట్లు, సాదిక్ ఇక్బాల్ ఒక వికెట్ తీశారు.
93 రన్స్ వద్ద హర్మన్‌ప్రీత్ కౌర్ ఔట్ అయింది.
తొలుత బ్యాటింగ్ చేసిన పాక్ 149 రన్స్ చేసింది. రాధిక యాదవ్
విజృంభించడంతో ఒక దశలో పాకిస్థాన్ 68 రన్స్‌కే నాలుగు వికెట్లు కోల్పోయి
కష్టాల్లో పడింది. అయితే.. కెప్టెన్ బిస్మాహ్ మరూఫ్ అద్భుత ఇన్నింగ్స్
ఆడింది. ఒకవైపు వికెట్లు పడుతున్నా ధాటిగా ఆడింది. 55 బంతుల్లో 7 ఫోర్లతో
68 రన్స్ చేసింది. మరూఫ్, అయేషా నసీం (43) తో కలిసి ఐదో వికెట్‌కు 81రన్స్
జోడించింది. వీళ్లిద్దరూ మరో వికెట్ పడకుండా ఆడి స్కోర్‌బోర్డు వంద
దాటించారు. ఓపెనర్ జవేరియా ఖాన్ (8), మునీబ ఆలీ (12), నిడా దార్ (0) స్వల్ప
స్కోర్‌కే పెవిలియన్ చేరారు. భారత బౌలర్లలో రాధ యాదవ్ రెండు వికెట్లు
పడగొట్టింది. దీప్తి శర్మ, పూజా వస్త్రకార్ తలా ఒక వికెట్ తీశారు.