స్పిన్నర్లు తిప్పేసిన వేళ తొలి టెస్టులో ఆస్ట్రేలియాపై టీమిండియా ఘనవిజయం
సాధించింది. 223 పరుగుల లోటుతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆసీస్..
అశ్విన్, జడేజా, అక్షర్ ల ధాటికి 91 పరుగులకే కుప్పకూలింది. దీంతో భారత్
ఇన్నింగ్స్ 132 పరుగుల తేడాతో ఘన విజయాన్ని అందుకుంది. 223 పరుగుల లోటుతో
రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆస్ట్రేలియాను భారత బౌలర్లు కుదురుకోనివ్వలేదు.
ఈ సిరీస్ ముందు వరకు సూపర్ ఫాంలో ఉన్న ఆసీస్ ఓపెనర్ ఉస్మాన్ ఖవాజాను స్లిప్ లో
కోహ్లీ క్యాచ్ తో ఔట్ చేసిన అశ్విన్.. వికెట్ల పతనానికి తెరలేపాడు. ఆ తర్వాత ఏ
దశలోనూ ఆస్ట్రేలియా కోలుకోలేదు. అశ్విన్ బౌలింగ్ లో కోహ్లీ క్యాచ్ జారవిడవటంతో
బతికిపోయిన వార్నర్ అవకాశాన్ని ఏమాత్రం సద్వినియోగం చేసుకోలేదు. 41 బంతుల్లో
10 పరుగులు చేసిన వార్నర్ అశ్విన్ బౌలింగ్ లోనే ఎల్బీగా వెనుదిరిగాడు. ఆ
తర్వాత లబూషేన్ (28 బంతుల్లో 17)ను జడేజా వెనక్కు పంపాడు. ఆ తర్వాతంతా అశ్విన్
విశ్వరూపమే చూపించాడు. వరుసగా వికెట్లు పడగొట్టాడు. యాష్ ధాటికి రెన్ షా (7
బంతుల్లో 2), హ్యాండ్స్ కాంబ్ (6 బంతుల్లో 6), అలెక్స్ క్యారీ (6 బంతుల్లో 10)
పెవిలియన్ కు క్యూ కట్టారు. ఈ 3 వికెట్లు ఎల్బీ రూపంలోనే రావడం గమనార్హం. ఆ
తర్వాత మిగతా పనిని జడేజా, అక్షర్, షమీలు లు పూర్తి చేశారు. రెండో ఇన్నింగ్స్
లో అశ్విన్ 5, జడేజా 2, షమీ 2, అక్షర్ ఒక వికెట్ దక్కించుకున్నారు.
మొదట టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియాను తొలి ఇన్నింగ్స్ లో
టీమిండియా 177 పరుగులకే ఆలౌట్ చేసింది. రవీంద్ర జడేజా 5 వికెట్లతో చెలరేగగా..
అశ్విన్ 3 వికెట్లు తీసుకున్నాడు. సిరాజ్, షమీలు తలా ఒక వికెట్
దక్కించుకున్నారు. ఆసీస్ బ్యాటర్లలో లబూషేన్ (49), స్మిత్ (37), హ్యాండ్స్
కాంబ్ (31), అలెక్స్ క్యారీ (36) పరుగులతో రాణించారు. అనంతరం మొదటి ఇన్నింగ్స్
లో భారత్ 400 పరుగులకు ఆలౌట్ అయ్యింది. దీంతో టీమిండియాకు 223 పరుగుల ఆధిక్యం
లభించింది. రోహిత్ శర్మ (120) సెంచరీతో రాణించగా.. అక్షర్ పటేల్ (84), అశ్విన్
(70), షమీ (37) పరుగులతో ఆకట్టుకున్నారు.