వరల్డ్ ఛాంపియన్ షిప్ ఫార్ములా- ఈ రేసు సాగరతీరాన విజయవంతంగా ముగిసింది.
శనివారం మధ్యాహ్నం జరిగిన ఈ రేసులో ఎలక్ట్రిక్ కార్లు ఒకదానికి మించి మరొకటి
పోటీపడ్డాయి. గంటకు 322 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లాయి. 11 టీమ్‌లు, 22 మంది
డ్రైవర్లు ఈ రేసులో పాల్గొన్నారు. ఈ రేసులో జీన్ ఎరిక్ విన్నర్‌గా నిలిచారు.
రెండో స్థానంలో నిక్ క్యాసిడీ, మూడో స్థానంలో సెబాస్టియన్ బ్యూమీ నిలిచారు.
సాగరతీరాన జరిగిన ఫార్ములా- ఈ రేసును చూసేందుకు పెద్ద సంఖ్యలో ప్రేక్షకులు,
సినీ ప్రముఖులు హాజరయ్యారు. ఫార్ములా-ఈ రేస్ పోటీలకు అనేక దేశాలు శాశ్వత
హోస్ట్‌గా వ్యవహరిస్తున్నాయి. అందులో ప్రధానంగా దిరియా, మెక్సికో సిటీ,
బెర్లిన్, మొనాకో, రోమ్, లండన్, జకార్తా, సియోల్ వంటి నగరాల్లో ఈ పోటీలు
ఏటా జరుగుతాయి. ప్రస్తుతం హైదరాబాద్‌లో అవి జరగడం విశేషం. ఇక మీదట భారతదేశం
నుంచి హైదరాబాద్ ఈ నగరాల జాబితాలో చేరనుందని నిర్వాహకులు వెల్లడిచారు.
దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్, నాగార్జున, రామ్ చరణ్, మలయాళ నటుడు
దుల్కర్ సల్మాన్, నటి శ్రుతి హాసన్‌తో సహా పలువురు మోటార్‌స్పోర్ట్స్
ఔత్సాహికులు, కేంద్ర మంత్రులు అనురాగ్ ఠాకూర్, కిషన్ రెడ్డి తదితర ప్రముఖులు ఈ
రేసును వీక్షించారు.