ఫార్ములా ఈ ప్రపంచ ఛాంపియన్షిప్ రేసింగ్ కు హైదరాబాద్ సిద్ధమైంది.
ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ‘ఫార్ములా-ఈ’ రేస్ ఈరోజు ప్రాక్టీస్
మ్యాచ్‌తో ప్రారంభం కానుంది. అంతర్జాతీయ పోటీలతో ‘ఫార్ములా-ఈ’ రేసు
హుస్సేన్‌సాగర్ తీరాన్ని అలరించనుంది. ఇప్పటివరకు విదేశాల్లో కనిపించే
రేసులను వీక్షించే అవకాశం ఇప్పుడు నగరవాసులకు లభిస్తుంది. హుస్సేన్‌సాగర్
ఒడ్డున జరిగే అంతర్జాతీయ పోటీల కోసం 2.8 కి.మీ స్ట్రీట్ సర్క్యూట్‌ను ఏర్పాటు
చేశారు. లుంబినీ పార్క్ నుంచి ప్రారంభమైన ఈ రేస్ మింట్ కాంపౌండ్, ఐమాక్స్
మీదుగా సచివాలయం వైపు నుంచి ఎన్టీఆర్ గార్డెన్ వరకు సాగనుంది.
2013లో ఫార్ములా-1 రేసు తర్వాత భారత్‌లో జరుగుతున్న తొలి రేసుకు మన
హైదరాబాద్ వేదికైంది. దీనికి తోడు ఓవరాల్‌గా ఇప్పటి వరకు ఫార్ములా-ఈ రేసుకు
ఆతిథ్యమిచ్చిన 27వ నగరంగా హైదరాబాద్ చోటు దక్కించుకుంది. హుసేన్సాగర్
తీరప్రాంతంలో 2.8కిలోమీటర్ల నిడివితో ప్రత్యేకంగా నిర్మించిన సర్క్యూట్‌పై
మొత్తం 11 జట్లు, 22 మంది రేసర్లు తమ కార్లను పరుగులు పెట్టించనున్నారు.
తొలిసారి ప్రవేశపెట్టిన అత్యాధునిక జెన్3 కార్లతో రేసర్లు దుమ్మురేపనున్నారు.
రేసింగ్‌లో విదేశీ కంపెనీలు, రేసర్లదే హవా కాగా, భారత్ నుంచి మహీంద్ర
రేసింగ్, టీసీఎస్ జాగ్వార్ బరిలోకి దిగడం గర్వంగా అనిపించింది.