టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా అంతర్జాతీయ మ్యాచ్ ఆడి చాలా రోజులే
అవుతోంది. అతడు చివరగా గత సెప్టెంబరు లో ఆడాడు. ఆస్ట్రేలియాతో జరిగిన టీ20
సిరీస్‌లో గాయపడిన అతడు ఆ తర్వాత టీ20 వరల్డ్ కప్‌నకు కూడా దూరమయ్యాడు.
శ్రీలంక, న్యూజిలాండ్‌తో సిరీస్‌లకు పునరాగమనం చేస్తాడని ఆశించినప్పటికీ
ఫిట్నెస్ లేమితో ఇంకాస్త ఆలస్యం కానుంది. ఆస్ట్రేలియాతో జరిగే మొదటి రెండు
టెస్టులకు కూడా అతడు దూరమయ్యే అవకాశముంది. ఇలాంటి పరిస్థితుల్లో బుమ్రా తన
కెరీర్‌పై ఫోకస్ పెట్టాలని, ఏ ఫార్మాట్ ఆడాలో నిర్ణయించుకోవాలని ఆసీస్ లెజెండ్
పేసర్ జెఫ్ థాంప్సన్ అభిప్రాయపడ్డారు. బుమ్రా కాస్త కన్నింగ్‌గా ఆలోచించాలని
స్పష్టం చేశారు. ఏ ఫార్మాట్ ఆడాలో నిర్ణయించుకోవాలని సలహా ఇచ్చారు.
“బుమ్రా తాను ఏ ఫార్మాట్ ఆడాలనుకుంటున్నాడో నిర్ణయించుకోవాలి. పరిమిత
ఓవర్లలో కొనసాగుదామనుకుంటున్నాడా? లేక టెస్టు క్రికెట్లో ఆడాలనుకుంటున్నాడా?
లేక రెండింటిలోనూ ఉండాలనుకుంటున్నాడా? అనేది నిర్ణయించుకోవాలి. టెస్టు
మ్యాచ్‌లు ఆడటం చాలా కష్టంగా ఉంటుంది. ముఖ్యంగా పరిమిత ఓవర్ల క్రికెట్లో
డబ్బు ఎక్కువగా వస్తున్నప్పుడు ఇంకా కష్టంగా ఉంటుంది. కాబట్టి దీర్ఘకాలంలో ఏది
బెటరో ఆటగాళ్లే నిర్ణయించుకోవాలి. మా రోజుల్లో డబ్బు గురించి ఆలోచించే వాళ్లం
కాదు. ఎందుకంటే ఆ రోజుల్లో డబ్బు అనే అంశమే లేదు. కానీ ఇప్పడంతా వ్యాపారమైంది.
కాబట్టి ఆటగాళ్లు తమ గురించి తామే ఆలోచించుకోవాలి. కాబట్టి ఏ ఫార్మాట్
ఆడాలనుకుంటున్నారో ముందే నిర్ణయించుకోవాలి.” అని జెఫ్ థాంప్సన్ స్పష్టం చేశారు.