భారతదేశం (ఆల్ ఇండియా ఫుట్ బాల్ ఫెడరేషన్(AIFF) ) తన బిడ్ ను
ఉపసంహరించుకోవడంతో ఏకైక బిడ్డర్ గా నిలిచిన సౌదీ అరేబియాకు ఆసియా కప్ 2027
నిర్వహణ హక్కులు లభించాయి. దీంతో 2027 ఆసియా కప్ కు సౌదీ అరేబియా ఆతిథ్యం
ఇవ్వనున్నది. ఈ విషయం ఆసియా ఫుట్ బాల్ సమాఖ్య (AFC) వెల్లడించింది.
అక్టోబర్లో భారతదేశం, సౌదీ అరేబియాలను AFC ఎగ్జిక్యూటివ్ కమిటీ షార్ట్ లిస్ట్
చేసింది. మూడుసార్లు ఛాంపియన్ గా నిలిచిన సౌదీ అరేబియా ఇప్పుడు తమ తొలి AFC
ఆసియా కప్ కు ఆతిథ్యం ఇవ్వనుంది. AFC కాంగ్రెస్ వచ్చే ఏడాది ఫిబ్రవరిలో బహ్
రాజధాని మనామాలో హోస్ట్ దేశాన్ని అధికారికంగా ప్రకటిస్తారు. కాగా, ఖతార్ లో
జరుగుతున్న ప్రపంచ కప్ లో సౌదీ అరేబియా తమ ప్రారంభ మ్యాచ్ 2-1తో అర్జెంటీనాను
ఓడించి సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే.

2023 ఆసియా కప్ కు కూడా ఖతార్ ఆతిథ్యం ఇవ్వనుంది. దీనిని గతంలో చైనాలో
నిర్వహించాలని నిర్ణయించారు. అయితే, కోవిడ్-19 మార్గదర్శకాల కారణంగా ఆ దేశం
ఉపసంహరించుకుంది. ఆసియా కప్ ప్రతి నాలుగేళ్లకోసారి జరుగుతుంది. 2019లో యూఏఈ
ఆతిథ్యమిచ్చిన టోర్నమెంట్ చివరి ఎడిషన్ను ఖతార్ గెలుచుకుంది.