ఔరా అనిపిస్తోంది. భారత జట్టు వెటరన్ పేసర్ జులాన్ గోస్వామి రిటైర్మెంట్
తర్వాత ఆమె వారసురాలిగా జట్టులోకి వచ్చిన రేణుక.. అద్భుతమైన ప్రదర్శనలు చేస్తూ
టీమిండియా విజయాల్లో కీలక పాత్ర పోషిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఆమెకు ఐసీసీ
ఎమర్జింగ్ ఉమెన్స్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు వరించింది. గతేడాది
ఫిబ్రవరిలో భారత జట్టులోకి వచ్చిన ఈ హిమాచల్ ప్రదేశ్ అమ్మాయి.. 2022కుగానూ ఈ
ఐసీసీ అవార్డును సొంతం చేసుకుంది. ఈ మేరకు ఐసీసీ ట్విట్టర్ ద్వారా ఈ విషయాన్ని
వెల్లడించింది.
ఈ అవార్డు రేసులో ఆస్ట్రేలియాకు చెందిన డార్సీ బ్రౌన్, ఇంగ్లాండ్ క్రీడాకారిణి
అలైస్ క్యాప్సీలతో పాటు తన సహచర క్రికెటర్ యాస్తికా భాటియాలు పోటీలో ఉన్నా..
రేణుకకే ఈ అవార్డు వరించింది. ఏడాదికాలంగా వన్డేలతో పాటు టీ20ల్లో భారత్
సాధించిన విజయాల్లో కీలక భూమిక పోషిస్తున్న రేణుకకు ఈ అవార్డు దక్కింది.
గతేడాది ఫిబ్రవరి 18న న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో వన్డేల్లోకి ఎంట్రీ
ఇచ్చిన రేణుక.. ఇప్పటివరకు 21 వన్డేల్లో 22 వికెట్లు తీసింది. మొత్తంగా 29
మ్యాచ్‌ల్లోనే 40 వికెట్లు సాధించింది. గతేడాది కామన్వెల్త్ గేమ్స్‌లో భాగంగా
ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో రేణుక వేసిన స్పెల్ ఓ సంచలనం. నాలుగు ఓవర్లు
వేసిన ఆమె నలుగురు ఆసీస్ బ్యాటర్లను ఔట్ చేసి ఆ జట్టుకు భారీ షాకిచ్చిన విషయం
తెలిసిందే.