రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (డబ్ల్యూఎఫ్ఐ) అధికారులపై వచ్చిన లైంగిక
దుష్ప్రవర్తన ఆరోపణలపై విచారించడానికి క్రీడా మంత్రిత్వ శాఖ పర్యవేక్షణ
కమిటీని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. అయితే కమిటీని ఏర్పాటు చేయడానికి
ముందు తమను సంప్రదించలేదని వినేష్ ఫోగట్, బజరంగ్ పునియాతో సహా టాప్ రెజ్లర్లు
ఒక రోజు తర్వాత ట్వీట్ చేశారు.
డబ్ల్యూఎఫ్ఐ అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌పై వచ్చిన లైంగిక వేధింపుల
ఆరోపణలపై విచారణ జరిపేందుకు ఐదుగురు సభ్యుల పర్యవేక్షణ కమిటీకి బాక్సింగ్
ఛాంపియన్ మేరీ కోమ్‌ను అధిపతిగా నియమించారు. ప్రభుత్వం నియమించిన కమిటీ తదుపరి
ఒక నెల పాటు డబ్ల్యుఎఫ్ఐ రోజువారీ వ్యవహారాలను కూడా నిర్వహిస్తుంది.
ప్యానెల్‌లోని ఇతర సభ్యులు ఒలింపిక్ పతక విజేత రెజ్లర్ యోగేశ్వర్ దత్, మాజీ
బ్యాడ్మింటన్ క్రీడాకారిణి, మిషన్ ఒలింపిక్ సెల్ మెంబర్ తృప్తి ముర్గుండే,
మాజీ సీఈఓ రాజగోపాలన్, మాజీ ఎస్ఏఐ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ – టీమ్స్ – రాధికా
శ్రీమాన్ ఉన్నారు.
“పర్యవేక్షక కమిటీ ఏర్పాటుకు ముందే మమ్మల్ని సంప్రదిస్తామని మాకు హామీ
ఇచ్చారు. అయితే కమిటీ ఏర్పాటుకు ముందు మమ్మల్ని సంప్రదించకపోవడం చాలా బాధాకరం”
అని వినేష్ ఫోగట్ ఒక ట్వీట్లో పేర్కొన్నారు.