ఇండోర్ వేదికగా న్యూజిలాండ్ తో జరిగిన మూడో వన్డేలో భారత్ 90 పరుగుల తేడాతో
ఘనవిజయం సాధించింది. 386 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కివీస్ జట్టు.. భారత
బౌలర్ల ధాటికి 295 పరుగులకే ఆలౌట్ అయ్యింది. ఈ విజయంతో మూడు మ్యాచ్ ల వన్డే
సిరీస్ ను భారత్ క్లీన్ స్వీప్ చేసింది. కివీస్ కి ఒక్క విజయం కూడా దక్కకుండా
సిరీస్ ను ఊడ్చేసింది. అంతేకాదు.. ఈ విజయంతో ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్ లోనూ
భారత్ అగ్రస్థానానికి ఎగబాకింది. ఇప్పటికే టీ20 ర్యాంకింగ్స్ లో టాప్ ప్లేస్
లో ఉన్న భారత్.. ఇప్పుడు వన్డేల్లోనూ అగ్రస్థానం కైవసం చేసుకుని, అరుదైన
రికార్డు నెలకొల్పింది. ఇక న్యూజిలాండ్‌తో జరిగిన సిరీస్‌లో 3వ మ్యాచ్‌లో
శుభ్‌మన్ గిల్ తన ఫామ్‌ను కొనసాగిస్తూ తన 4వ వన్డే సెంచరీని నమోదు చేశాడు.
సిరీస్‌లోని మొదటి రెండు మ్యాచ్‌లలో 208, 40-(నాటౌట్) స్కోర్ చేసిన గిల్ మూడవ
మ్యాచ్ లో 112 పరుగులు చేసి 3-మ్యాచ్‌ల అసైన్‌మెంట్‌లో అత్యధిక స్కోరింగ్
బ్యాటర్ గా పేరొందాడు. ఇండోర్‌లో జరిగిన ఈ మూడో మ్యాచ్‌లో గిల్ 112 పరుగుల
మార్కును తాకడంతో, అతను ‘3-మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో అత్యధిక పరుగులు చేసిన’
పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ అజామ్ రికార్డును దాదాపు సమం చేశాడు. ఇప్పటి వరకు
బాబర్ 3 మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో అత్యధిక పరుగులు (360) సాధించిన రికార్డును
కలిగి ఉన్నాడు. పాకిస్థాన్ దిగ్గజం రికార్డును అధిగమించేందుకు గిల్ 113
పరుగులు చేయాల్సి ఉండగా, అతను 112 పరుగుల వద్ద ఔటయ్యాడు.