కెప్టెన్ ‘సిక్స్‌ల’ రికార్డ్!
9 వికెట్ల నష్టానికి 385 పరుగులు చేసిన ఇండియా
ఇండోర్ వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతోన్న మూడో వన్డేలో భారత ఓపెనర్లు రోహిత్
శర్మ, శుభ్‌మన్ గిల్ శతకాలతో అదరగొట్టారు. బ్యాటింగ్‌కు అనుకూలించే పిచ్ మీద
వీరిద్దరూ అనుభవం లేని కివీస్ బౌలర్లతో టీ20 తరహాలో ఆటాడుకున్నారు.
ఫెర్గ్యుసన్ వేసిన ఇన్నింగ్స్ ఎనిమిదో ఓవర్లో నాలుగు ఫోర్లు, ఓ సిక్స్ బాదిన
గిల్ 33 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. మరో ఎండ్‌లో రోహిత్ శర్మ
41 బంతుల్లో అర్ధ శతకం నమోదు చేశాడు. వీరిద్దరూ 26.1 ఓవర్లలో బంతుల్లోనే 212
పరుగుల భాగస్వామ్యం నమోదు చేశారు. మొత్తమ్మీద చాలా నెలల తరువాత రోహిత్ సెంచరీ
బాదాడు. ఇక 50 ఓవర్లలో భారత్ 9 వికెట్లు నష్టపోయి 385 పరుగులు చేసి 386 భారీ
లక్యాన్ని కివీస్ ముందుంచింది.
రోహిత్ రికార్డులు
వన్డేల్లో అత్యధిక సిక్స్‌లు బాదిన ఆటగాళ్ల జాబితాలో రోహిత్ శర్మ మూడో
స్థానానికి చేరుకున్నాడు. అఫ్రిదీ 369 ఇన్నింగ్స్‌ల్లో 351 సిక్స్‌లతో
అగ్రస్థానంలో ఉండగా.. వెస్టిండీస్ హిట్టర్ క్రిస్ గేల్ 294 ఇన్నింగ్స్‌ల్లో
331 సిక్సులతో రెండో స్థానంలో ఉన్నాడు. రోహిత్ 234 ఇన్నింగ్స్‌ల్లో 271
సిక్సులు బాదాడు.
కివీస్‌పై సెంచరీతో వన్డేల్లో అత్యధిక శతకాలు బాదిన ఆటగాళ్ల జాబితాలో రోహిత్
మూడో స్థానానికి చేరుకున్నాడు. ఈ క్రమంలో రిక్కీ పాంటింగ్ (30) శతకాలను రోహిత్
సమం చేశాడు. రోహిత్ కంటే సచిన్ (49), కోహ్లి (46) మాత్రమే ముందున్నారు.
చివరిసారిగా 2020 జనవరి 19న ఆస్ట్రేలియాతో జరిగిన వన్డేలో సెంచరీ చేసిన రోహిత్
శర్మ.. మూడేళ్ల తర్వాత మళ్లీ సెంచరీ చేయడం గమనార్హం.
జస్ట్ ఒక్క పరుగు.. బాబర్ అరుదైన రికార్డ్‌ను బ్రేక్ చేసే ఛాన్స్ మిస్సయిన
గిల్..!
న్యూజిలాండ్‌తో జరిగిన తొలి వన్డేలో 208 పరుగులు చేసిన గిల్.. రెండో వన్డేలో
40 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. మూడో వన్డేలో 112 రన్స్ చేసిన భారత ఓపెనర్
మూడు వన్డేల సిరీస్‌లో 360 పరుగులు చేశాడు. తద్వారా మూడు వన్డేల సిరీస్‌లో
అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజమ్ రికార్డును
సమం చేశాడు. బాబర్ 2016లో వెస్టిండీస్‌పై వరుసగా మూడు సెంచరీలు చేసి 360
పరుగులు చేశాడు.
బాబర్ ఆజమ్ రికార్డును సమం చేసిన భారత ఓపెనర్
న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌లో భారత ఓపెనర్ శుభ్‌మన్ గిల్ అదరగొట్టే ప్రదర్శన
చేశాడు. తొలి వన్డేలో డబుల్ సెంచరీ చేసిన గిల్.. మూడో వన్డేలో శతకంతో సత్తా
చాటాడు. మూడు మ్యాచ్‌ల్లో కలిపి 360 పరుగులు చేసిన గిల్.. మూడు వన్డేల
సిరీస్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజమ్
రికార్డును సమం చేశాడు. హైదరాబాద్ వన్డేలో 208 పరుగులు చేసిన గిల్.. రాయ్‌పూర్
వన్డేలో 40 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. మూడో వన్డేలో 112 రన్స్ చేసిన మరో
పరుగు చేస్తే బాబర్ ఆజమ్ రికార్డును బ్రేక్ చేసే అవకాశం ఉన్న దశలో గిల్
ఔటయ్యాడు. 2016లో వెస్టిండీస్‌పై మూడు వన్డేల్లో వరుసగా శతకాలు బాదిన బాబర్
ఆజమ్.. 360 పరుగులు చేశాడు.
బాబర్ రికార్డ్‌ను సమం చేసిన గిల్‌కు గత 4 వన్డేల్లో ఇది మూడో శతకం కావడం
గమనార్హం. శ్రీలంకతో జరిగిన చివరి వన్డేలో సెంచరీ చేసిన గిల్.. ఆ తర్వాత
హైదరాబాద్ వన్డేలో ఏకంగా డబుల్ సెంచరీ చేశాడు. తద్వారా వన్డేల్లో ద్విశతకం
బాదిన పిన్న వయస్కుడిగా రికార్డ్ క్రియేట్ చేశాడు. గత 18 వన్డేల్లో 5 హాఫ్
సెంచరీలు, 4 సెంచరీలు చేసిన గిల్.. 86 యావరేజ్‌తో 1204 పరుగులు చేయడం అతడి
నిలకడకు అద్దం పడుతోంది.
వన్డేల్లో 21 ఇన్నింగ్స్ తర్వాత అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా శుభ్‌మన్ గిల్
(1254 రన్స్) నిలిచాడు. ఇంతకు ముందు ఈ రికార్డ్ పాకిస్థాన్‌కు చెందిన ఇమామ్
ఉల్ హక్ (1090) పేరిట ఉండేది. మూడో వన్డేలో గిల్, రోహిత్ తొలి వికెట్‌కు 212
పరుగులు జోడించారు. 2019 వరల్డ్ కప్ తర్వాత వన్డేల్లో భారత్ ఓపెనర్లకు ఇది
రెండో ద్విశతక భాగస్వామ్యం మాత్రమే.