ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ జట్ల మధ్య మూడు వన్డే మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా
ఇవాళ చివరి వన్డే మ్యాచ్ జరగనుంది. ఇండోర్‌లోని హోల్కర్ స్టేడియంలో ఈ మ్యాచ్
జరుగుతుంది. స్వదేశంలో వరుస మ్యాచ్ లు ఆడుతున్న భారత్ జట్టు.. ఇటీవల శ్రీలంక
జట్టుతో జరిగిన వన్డే సిరీస్ ను క్లీన్‌స్వీప్ చేసింది. ప్రస్తుతం న్యూజిలాండ్
జట్టుపైకూడా వరుసగా రెండు మ్యాచ్ లలో విజయం సాధించి సిరీస్ ను కైవసం
చేసుకుంది. మూడో వన్డేలోనూ విజయం సాధించి ఈ సిరీస్ ను క్లీన్ స్వీప్ చేయాలని
భారత్ పట్టుదలతో ఉంది.భారత్ జట్టు ఆటగాళ్లు అద్భుత ప్రతిభ చూపుతున్నారు. యువ
ఆటగాళ్లుసైతం వచ్చిన అవకాశాన్ని చక్కగా సద్వినియోగం చేసుకుంటున్నారు.
బ్యాటింగ్ పరంగా భారత్ జట్టు బలంగా ఉంది. రెండో వన్డేలో బౌలర్ల అద్భుత
ప్రదర్శనతో బౌలింగ్ విభాగంలోనూ భారత్ జట్టు బలంగానే ఉందని చెప్పొచ్చు. మరోవైపు
మూడో వన్డేలో మెరుగైన ప్రదర్శనతో క్లీన్‌స్వీప్ గండం నుంచి తప్పించుకోవాలని
న్యూజిలాండ్ జట్టు భావిస్తోంది.