మునుపటి ఫామ్ ను దొరకబుచ్చుకొన్న విరాట్ కోహ్లీకి ‘2022 ఐసీసీ టీ ట్వంటీ టీమ్
ఆఫ్ ది ఇయర్’ జట్టులో చోటు దక్కింది. అలాగే హార్దిక్ పాండ్యా, సూర్యకుమార్
యాదవ్ కు కూడా తుది 11 మందిలో స్థానం లభించింది. ఈ జట్టుకు వరల్డ్ కప్ గెలిచిన
ఇంగ్లండ్ సారథి బట్లర్ ను కెప్టెన్గా ఎంపిక చేసింది. అలాగే మహిళల ‘టీ20 టీమ్
ఆఫ్ ఇయర్ జట్టులో భారత్ నుంచి నలుగురికి చోటు దక్కడం విశేషం. స్మృతీ మంధాన,
ఆల్ రౌండర్ దీప్తీశర్మ, కీపర్ రిచా ఘోష్, పేసర్ రేణుకా సింగ్ ఎంపికయ్యారు.
పురుషుల జట్టు: జోస్ బట్లర్ (కీపర్/కెప్టెన్), మహ్మద్ రిజ్వాన్, కోహ్లి,
సూర్యకుమార్, గ్లెన్ ఫిలిప్స్, సికిందర్ రాజా, హార్దిక్ పాండ్యా, సామ్
కర్రాన్, విందు హసరంగ, హారిస్ రౌఫ్, జోష్ లిటిల్
మహిళల జట్టు: సోఫీ డివైన్ (కెప్టెన్), స్మృతీ మంధాన, బెత్ మూనీ, గార్డ్నర్,
తహీలా మెత్, నిదా దర్, దీప్తీశర్మ, రిచా ఘోష్ (కీపర్), ఎకిలోస్టోన్, రేణుకా
సింగ్.