Select Your Language:

English हिन्दी বাংলা ગુજરાતી

వార్తలు

బ్రిటన్‌ నిఘా విమానం సమీపంలోకి దూసుకొచ్చిన రష్యన్‌ క్షిపణి!

ఉక్రెయిన్‌ యుద్ధ సంక్షోభం నడుమ రష్యా మరో వివాదానికి కారణమైంది. తమ రాయల్‌ ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన నిఘా విమానానికి సమీపంలో.. రష్యా యుద్ధ విమానం ఓ క్షిపణిని ప్రయోగించినట్లు బ్రిటన్‌ తాజాగా ఆరోపించింది. లండన్‌: ఉక్రెయిన్‌ యుద్ధ సంక్షోభం నడుమ రష్యా  మరో వివాదానికి కారణమైంది. తమ రాయల్‌ ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన నిఘా విమానానికి సమీపంలో.. రష్యా యుద్ధ విమానం ఓ క్షిపణిని ప్రయోగించినట్లు బ్రిటన్‌ తాజాగా ఆరోపించింది. సెప్టెంబరు 29న నల్ల సముద్రం  మీదుగా అంతర్జాతీయ గగనతలంలో గస్తీ విధుల్లో ఉండగా.. ఈ ఘటన జరిగినట్లు బ్రిటన్‌ రక్షణ శాఖ మంత్రి బెన్‌ వాలెస్‌ పార్లమెంట్‌ వేదికగా వెల్లడించారు. అయితే.. సాంకేతిక లోపం కారణంగానే ఈ సమస్య తలెత్తినట్లు రష్యా పేర్కొనడం గమనార్హం. తమ నిరాయుధ విమానం(ఆర్‌ఏఫ్‌ ఆర్‌సీ- 135 రివెట్‌ జాయింట్‌) విషయంలో జరిగిన ఈ ఘటనను ఉద్దేశపూర్వక చర్యగా పరిగణించడం లేదని వాలెస్‌ తెలిపారు. అయితే.. రష్యా తన యుద్ధ విమానాలను వినియోగించే తీరు ఎంతటి విపత్కర పరిణామాలకు దారితీయగలదో ఇది వెల్లడిస్తుందన్నారు. ఈ విషయమై.. రష్యా రక్షణ శాఖ మంత్రి సెర్గీ షోయిగుతో తమ ఆందోళనను వ్యక్తం చేసినట్లు చెప్పారు.‘ఈ ఘటనపై తాము విచారణ జరిపినట్లు అక్టోబర్ 10న రష్యా రక్షణ శాఖ మంత్రి బదులిచ్చారు. సుఖోయ్‌- 27ఎస్‌...

Read more

రిషి సునక్: లిజ్‌ ట్రస్‌ రాజీనామా.. అందరి చూపూ రిషి సునాక్‌ వైపే?

బ్రిటన్‌లో ఆర్థిక సంక్షోభం నేపథ్యంలో ప్రధానిగా లిజ్‌ ట్రస్‌ రాజీనామా ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే, వచ్చే వారం నాటికి తదుపరి ప్రధానిని ఎన్నుకుంటారని ఆమె ప్రకటించడంతో అందరిచూపూ భారత సంతతికి చెందిన రిషి సునాక్‌ పైనే పడింది. ఇంటర్నెట్‌ డెస్క్‌: బ్రిటన్‌లో ఆర్థిక సంక్షోభం నేపథ్యంలో ప్రధానిగా లిజ్‌ ట్రస్‌ రాజీనామా ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే, వచ్చే వారం నాటికి తదుపరి ప్రధానిని ఎన్నుకుంటారని ఆమె ప్రకటించడంతో అందరిచూపూ భారత సంతతికి చెందిన రిషి సునాక్‌ పైనే పడింది. బ్రిటన్‌లో పరిణామాలకు సంబంధించి కొన్ని కీలక పాయింట్లు ఇవే.. బ్రిటన్‌లో ఆర్థిక మాంద్యం తీవ్రరూపం దాల్చే అవకాశం ఉందన్న ఆందోళనల నేపథ్యంలో తాను ఏ లక్ష్యంతోనైతే పదవి చేపట్టానో దాన్ని నిర్వర్తించే పరిస్థితిలేక రాజీనామా చేస్తున్నట్టు లిజ్‌ తెలిపారు. ఆమె చేపట్టిన ఆర్థిక కార్యక్రమాలపై సొంత పార్టీ నేతల నుంచే తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దే లక్ష్యంతో లిజ్‌ తీసుకున్న చర్యలు కన్జర్వేటివ్‌ పార్టీలో చీలికలు తీసుకొచ్చాయి. బ్రిటన్‌ చరిత్రలో అత్యంత తక్కువ రోజులు (దాదాపు ఆరు వారాలు) ప్రధానిగా ఉన్న వ్యక్తి లిజ్‌ ట్రస్‌.లిజ్‌ ట్రస్‌ అధికారం చేపట్టిన తర్వాత గత నెలలో ప్రవేశపెట్టిన మినీ బడ్జెట్‌తో దేశ ఆర్థిక వ్యవస్థ కుదేలైంది. మార్కెట్లు కుప్పకూలడం, పౌండ్‌ విలువ పతనం గందరగోళానికి దారితీసింది. అయితే, ఈరోజు ఆమె రాజీనామా ప్రకటించడంతో చోటుచేసుకున్న పరిణామాల వేళ పౌండ్‌ విలువ 0.36శాతం పెరిగినట్టు సమాచారం. కన్జర్వేటివ్‌ పార్టీ నేత జెర్మీ హంట్‌ తాను ప్రధాని రేసులో లేనని ప్రకటించారు. దీంతో తదుపరి ప్రధానిగా ఎవరికి అవకాశం వస్తుందన్న చర్చలో ప్రధానంగా రిషి సునాక్‌ పేరే వినిపిస్తోంది. కొన్ని నెలల క్రితం జరిగిన కన్జర్వేటివ్‌ పార్టీ ఎన్నికల్లో లిజ్‌ ట్రస్‌ చేతిలో రిషి ఓటమిపాలైన విషయం తెలిసిందే....

Read more

‘కూరగాయతో పోటీలో లిజ్‌ ట్రస్‌ ఓటమి’.. ఈ వింత బెట్టింగ్‌ ఏంట్రా సామీ!

బ్రిటన్‌కు చెందిన డెయిలీ స్టార్‌ అనే పత్రిక వారం క్రితం ఓ పోటీ ప్రారంభించింది. కూరగాయ ముందుగా కుళ్లిపోతుందా? లిజ్‌ ట్రస్‌ పదవి ముందుగా పోతుందా? అనేది పోటీ! ఇంటర్నెట్‌ డెస్క్‌: ‘ఫలానా మ్యాచ్‌లో కోహ్లీ సెంచరీ చేస్తాడు.. నాదీ 100 రూపాయల బెట్‌’.. ‘ఆ ఎన్నికల్లో ఫలానా పార్టీ గెలవకపోతే నేను ఇకపై ఓటెయ్య!’.. సాధారణంగా బెట్టింగ్‌లంటే ఇలానే ఉంటాయి. కానీ, బ్రిటన్‌లో గడిచిన వారం రోజులుగా ఓ బెట్టింగ్‌ నడిచింది. హోరాహోరీ పోరులో ఆ దేశ ప్రధాని లిజ్‌ ట్రస్‌పై ఓ కూరగాయ గెలుపొందింది. కూ..ర..గా..య.. గెలుపొందిందా? వినడానికి ఆశ్చర్యంగా కదూ! అయితే ఆ పోటీ ఏంటో తెలుసుకోవాలి. బ్రిటన్‌కు చెందిన డెయిలీ స్టార్‌ అనే పత్రిక వారం క్రితం ఓ పోటీ నిర్వహించింది. క్యాబేజీని పోలిన ఓ కూరగాయ ను ఒక పక్క.. బ్రిటన్‌ ప్రధాని లిజ్‌ ట్రస్‌ ఫొటోను ఒక పక్క పెట్టింది....

Read more

‘వర్క్‌ ఫ్రమ్‌ హోం’తో ఉత్పాదకత పెరిగింది, కానీ..: సత్య నాదెళ్ల

వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ వల్ల ఉత్పాదకత పెరిగినప్పటికీ, ఉద్యోగుల మధ్య సంబంధాలు మెరుగుపడాలన్నా, కొత్త బృందాలను ఏర్పాటు చేయాలన్నా కార్యాలయానికి వెళ్తేనే ఎక్కువ ప్రయోజనం ఉంటుందని మైక్రోసాఫ్ట్‌ సీఈవో సత్యనాదెళ్ల  అభిప్రాయపడ్డారు. వాషింగ్టన్‌: కొవిడ్‌ పరిస్థితులు తగ్గుముఖం పట్టడం, జనజీవనం సాధారణ స్థితికి వచ్చినందున పరిశ్రమలు ఉత్పాదకత పెంచడానికి సరికొత్త మార్గాలవైపు అడుగులేయాల్సిన అవసరముందని మైక్రోసాఫ్ట్‌ సీఈవో సత్యనాదెళ్ల అన్నారు. ఇటీవల ఓ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పని సంస్కృతిని మార్చడం ఎలా? అనేదాని గురించి ఆయన మాట్లాడారు. వర్క్‌ ఫ్రం హోం చేస్తున్న ఉద్యోగులు తిరిగి కార్యాలయాలకు రావాలని చాలా సంస్థలు కోరుతున్నాయని చెప్పిన ఆయన.. సంస్థకు, ఉద్యోగికి అనుకూలంగా ఉండేలా నిర్ణయాలు తీసుకుంటే మంచిదని చెప్పారు.అయితే, ఉద్యోగుల మధ్య సంబంధాలు మెరుగుపడాలన్నా, కొత్త టీంలు ఏర్పాటు చేయాలన్నా కార్యాలయానికి రావడమే ఉత్తమమని చెప్పారు. ఉద్యోగులకు మేనేజర్లు ఈ విషయాన్ని అర్థమయ్యేలా చెప్తే ప్రయోజనముంటుందన్నారు. మైక్రోసాఫ్ట్‌ సహా గూగుల్‌, అమెజాన్‌ లాంటి కంపెనీలు వారంలో కొన్ని రోజుల పాటు ఆఫీసుకు వచ్చి, మిగతా రోజులు ఇంటి నుంచే పని చేసుకునేందుకు ఉద్యోగులకు వెసులుబాటు కల్పిస్తున్నాయని నాదెళ్ల చెప్పారు. దీనివల్ల సంస్థకు నిర్వహణ ఖర్చులు తగ్గుతాయని, అంతేకాకుండా ఉద్యోగులు...

Read more

ఆప్ మాజీ కౌన్సిల‌ర్ కు ఢిల్లీ కోర్టులో ఊరట.. – అల్ల‌ర్ల కేసు క్లియ‌ర్‌

ఈశాన్య ఢిల్లీ లో 2020 ఫిబ్రవరి నెలలో జరిగిన అల్లర్ల కేసులో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) మాజీ కౌన్సిలర్ తాహిర్ హుస్సేన్ కు ఢిల్లీ కోర్టులో...

Read more

ముంబైలో బిల్డ‌ర్ ఆత్మ‌హ‌త్య.. – 23వ అంతస్తు నుంచి దూకి బ‌ల‌వ‌న్మ‌ర‌ణం

దేశ ఆర్థిక రాజధాని ముంబైలో ప్రముఖ బిల్డర్‌ పరాస్ పోర్వాల్ (57) ఆత్మహత్య చేసుకున్నాడు. ఉదయం 6 గంటల సమయంలో 23వ అంతస్తులోని త‌న జిమ్‌ బాల్కనీ...

Read more

31 గంటల పాటు విమానాశ్ర‌యంలోనే.. సంగీత ద‌ర్శ‌కుడు రికీ కేజ్ దుస్థితి

సంగీత ప్ర‌పంచంలో గ్రామీ సంగీత అవార్డును ద‌క్కించుకున్న సంగీత ద‌ర్శ‌కుడు రికీ కేజ్ దాదాపు 31 గంట‌ల పాటు విమానాశ్ర‌యంలోనే ఉండిపోవాల్సిన ప‌రిస్థితి ఏర్ప‌డింది. అక్టోబ‌రు 18న...

Read more

బ్రిటన్‌ ప్రధాని లిజ్‌ ట్రస్‌ రాజీనామా

బ్రిటన్‌ ప్రధాని లిజ్‌ ట్రస్‌ రాజీనామా చేశారు. తానిచ్చిన హామీలను నిలబెట్టుకోలేకపోయానని, అందుకే రాజీనామా చేస్తున్నట్లు ఆమె ప్రకటించారు. కొత్త ప్రధాని ఎన్నికయ్యే వరకూ తాను ప్రధాని...

Read more

ప్లాస్మాకు బదులు బత్తాయి జ్యూస్! -రోగి మృతి, యూపీలో ఘటన

ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో ఓ డెంగ్యూ రోగికి ప్లాస్మాకు బదులు బత్తాయి జ్యూస్‌ను స్థానిక బ్లడ్ బ్యాంక్ సరఫరా చేసిందని వీడియో ద్వారా ఓ వ్యక్తి ఆరోపించాడు. దీనిపై...

Read more

కాపీ చీటీని ప్రేమలేఖ అనుకుని…. – బీహార్‌లో బాలుడి దారుణ హత్య

బీహార్‌లో ఒక భయంకరమైన సంఘటన వెలుగులోకి వచ్చింది. పరీక్షలో ఒక అబ్బాయి ప్రేమ లేఖ రాశాడని భావించిన బాలిక పెద్దలకు చెప్పడం..‌మరుసటి రోజు ఆ బాలుడు హత్యకు...

Read more
Page 261 of 264 1 260 261 262 264