కోల్కతా : పశ్చిమ బెంగాల్ గవర్నర్ సి.వి.ఆనందబోస్కు ఈ నెల 26న
అక్షరాభ్యాసం జరగనుంది! ఈ వయసులో ఆయనకు అక్షరాభ్యాసం ఏంటని
ఆశ్చర్యపోతున్నారా..? ఆశ్చర్యకరమే అయినా అదే నిజం! ఈ నెల 26న సరస్వతీ పూజను
పురస్కరించుకుని రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సమక్షంలో ఆనందబోస్కు
రాజ్భవన్లో ఈ క్రతువు జరగనుంది. సాధారణంగా బెంగాలీ (బంగ్లా) భాషలోని
అక్షరాలను నేర్చుకునే ప్రక్రియను ప్రారంభించే ముందు చిన్నారులకు ‘హతేఖోరీ’
పేరుతో సంప్రదాయ రీతిలో అక్షరాభ్యాస తంతును నిర్వహిస్తారు. ఇప్పటికే ఆంగ్లం,
మలయాళం, హిందీ భాషల్లో దాదాపు 40 పుస్తకాలు రాసిన ఆనందబోస్ బెంగాలీలోనూ ఓ
పుస్తకం రాయాలన్న తన ఆసక్తిని పశ్చిమ బెంగాల్ గవర్నర్గా నియమితులైన
తొలినాళ్లలోనే వెలిబుచ్చారు. ఆ ప్రయత్నంలో భాగంగానే భాష నేర్చుకునేందుకు
తాజాగా అక్షరాభ్యాస ముహూర్తం నిశ్చయించుకున్నారు.