చెన్నై : దేశీయ మొబైల్ ఆపరేటింగ్ సిస్టంను (ఓఎస్) ఐఐటీ మద్రాస్
తీసుకొచ్చింది. కేంద్ర శాస్త్ర, సాంకేతికశాఖ నిధులతో ‘ఆత్మ నిర్భర్ భారత్’లో
భాగంగా ఈ సరికొత్త సాఫ్ట్‌వేర్‌ను తయారు చేసినట్లు ప్రకటించింది.
దేశవ్యాప్తంగా 100 కోట్ల మొబైల్ వినియోగదారుల సమాచారం భద్రంగా ఉండేలా,
సౌకర్యంగా వినియోగించుకునేలా ఇది ఉంటుందని వెల్లడించింది. దీనికి ‘భారోస్
(భారత్ ఓఎస్)’ అని పేరుపెట్టింది. ఐఐటీ మద్రాస్ ఇంక్యుబేటర్‌కు చెందిన
జండ్‌కే ఆపరేటింగ్ ప్రైవేట్ లిమిటెడ్ (జండ్ కాప్స్) సంస్థ దీన్ని
రూపొందించింది. ఈ వివరాల్ని ఐఐటీ మద్రాస్ డైరెక్టర్ వి.కామకోటి
వెల్లడించారు. ఈ ఓఎస్‌ను ప్రస్తుతానికి ఎంపిక చేసిన సంస్థలకే ఇచ్చామని, త్వరలో
ప్రజలకు అందుబాటులోకి తెస్తామని తెలిపారు. జండ్‌కాప్స్ సంస్థ డైరెక్టర్
కార్తిక్ అయ్యర్ మాట్లాడుతూ ఈ ఓఎస్ వినియోగదారుల వ్యక్తిగత సమాచారాన్ని
అత్యంత భద్రంగా ఉంచుతుందని తెలిపారు.