ఈ నెల 11న ఆన్లైన్ ద్వారా ప్రదానం
న్యూఢిల్లీ : గ్లోబల్ లీడర్షిప్ అవార్డు(ప్రపంచ నాయకత్వ అవార్డు)కు భారత
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ ఎంపిక అయ్యారు.
న్యాయ వృత్తిలో జీవితకాల సేవలకుగాను ఆయన్ను కేంబ్రిడ్జ్‌లోని హార్వర్డ్ లా
స్కూల్ సెంటర్ ఎంపిక చేసింది. ఈ అవార్డును జనవరి 11న ఆన్లైన్ ద్వారా
అందించనున్నారు. ఎల్ఎల్ఎమ్ డిగ్రీ, జుడీషియల్ సైన్సెస్‌లో డాక్టరేట్
పట్టాలను హార్వర్డ్ లా స్కూల్ నుంచే ఆయన పొందారు. అయోధ్య రామమందిరం లాంటి
చారిత్రాత్మక తీర్పులు ఇచ్చిన బెంచ్‌లో జస్టిస్ చంద్రచూడ్ సభ్యులు.