*సిమ్లా : హిమపాతం కారణంగా హిమాచల్‌ప్రదేశ్ రోహ్‌తంగ్‌పాస్‌లోని అటల్
టన్నెల్ దక్షిణ ప్రాంతం సమీపంలో 400 వాహనాల్లో చిక్కుకుపోయిన పర్యాటకులను
రక్షించినట్లు అధికారులు తెలిపారు. గురువారం మానాలి-లేహ్ రహదారి, దాని
పరిసర ప్రాంతాల్లో భారీగా మంచు కురవడం వల్ల వాహనాలు నిలిచిపోయినట్లు వారు
వెల్లడించారు. పోలీసు బృందాలు చేపట్టిన సహాయ కార్యక్రమాలకు 10-12 గంటలు
పట్టింది. శుక్రవారం తెల్లవారుజామున 4 గంటలకు ముగిసింది. వాహనాలు వాటి
గమ్యస్థానాలకు వెళ్లినట్లు అధికారులు చెప్పారు. చిక్కుకుపోయిన పర్యాటకులు,
స్థానికులకు ఆహారం అందించినట్లు వెల్లడించారు. మరోవైపు హిమపాతాన్ని
ఆస్వాదించినట్లు పర్యాటకులు పేర్కొన్నారు. నూతన సంవత్సర వేడుకలను
జరుపుకోవడానికి పెద్ద సంఖ్యలో పర్యాటకులు కులు, మనాలికి తరలివస్తున్నారు.