న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా జరుగుతున్నమాక్ డ్రిల్‌లో భాగంగా కేంద్ర ఆరోగ్య శాఖ
మంత్రి మన్సుఖ్ మాండవియా మంగళవారం న్యూఢిల్లీలోని సఫ్దర్‌జంగ్ ఆసుపత్రిని
సందర్శించారు. కోవిడ్ నిర్వహణ సంసిద్ధతను అంచనా వేయడానికి నిర్వహించిన మాక్
డ్రిల్ లో భాగంగా ఆయన ఆస్పత్రిని సందర్శించి అక్కడి సౌకర్యాలు, ఏర్పాట్లను
సమీక్షించారు. అనేక దేశాల్లో పెరుగుతున్న కోవిడ్ కేసులను దృష్టిలో వుంచుకుని
దేశవ్యాప్తంగా గుర్తించబడిన ఆస్పత్రుల్లో డిసెంబర్ 27 న ఆరోగ్య సదుపాయాలతో
కూడిన సన్నద్ధత పై మాక్ డ్రిల్స్ నిర్వహించాలని కేంద్రం అన్ని రాష్ట్రాలు,
కేంద్రపాలిత ప్రాంతాలను కోరింది.
ఈ ఆరోగ్య సౌకర్యాల కార్యాచరణ సంసిద్ధతను నిర్ధారించడం ఈ కార్యక్రమ లక్ష్యం. ఈ
క్రమంలో దేశంలోని అన్ని కోవిడ్ ఆసుపత్రుల్లో ప్రజలకు సరైన చికిత్స అందేలా
మంగళవారం మాక్ డ్రిల్ నిర్వహించారు. దేశంలో కేసులు పెరిగితే మహమ్మారిపై
పోరాడేందుకు ప్రభుత్వం కూడా సిద్ధమవుతోందని ఆరోగ్య మంత్రి తెలిపారు. ఈ
ప్రక్రియ సమయంలో.. అన్ని జిల్లాలను కవర్ చేసే ఆరోగ్య సౌకర్యాల భౌగోళిక
ప్రాతినిధ్య లభ్యత, ఐసోలేషన్ బెడ్లు, ఆక్సిజన్ సపోర్టెడ్ ఐసోలేషన్ బెడ్లు,
ఐసియు బెడ్లు, వెంటిలేటర్ సపోర్టెడ్ బెడ్లు, మానవ వనరుల లభ్యత వంటి అంశాలపై
దృష్టి పెట్టాలని రాష్ట్రాలకు రాసిన లేఖలో కేంద్రం ఆదేశించింది.