ఫరీదాబాద్ : బీజేపీ నాయకులు ఎన్ని సభలైనా నిర్వహించుకోవచ్చు గానీ తాము మాత్రం
పాదయాత్ర చేపట్టకూడదా అని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ నిలదీశారు. భారత్
జోడో యాత్రలో ఆయన హరియాణాలోని ఫరీదాబాద్‌లో బహిరంగ సభలో ప్రసంగించారు.
దేశవ్యాప్తంగా ఎన్ని సభలైనా పెట్టుకుంటామంటూ బీజేపీ నాయకులు చెబుతున్నారని
గుర్తుచేశారు. జోడో యాత్రలోనే వారికి కరోనా కనిపిస్తోందని ఎద్దేవా చేశారు.
ప్రజల్లో విద్వేషాలు సృష్టించడమే బీజేపీ పనిగా పెట్టుకుందని దుయ్యబట్టారు.
రైతులు, యువత మనసులను భయంతో నింపి, దాన్ని విద్వేషంగా మార్చాలన్నదే బీజేపీ
కుతంత్రమని మండిపడ్డారు. కానీ, దేశంలో రైతులు, యువతతో సహా సామాన్య ప్రజలంతా
ప్రేమ అనే భాషను మాట్లాడుతున్నారని, కలిసి నడుస్తున్నారని రాహుల్ చెప్పారు.
జోడో యాత్ర శనివారం దేశ రాజధాని ఢిల్లీలోకి ప్రవేశించనుంది.