ప్రస్తుతానికి ప్రైవేటు ఆసుపత్రుల్లో అందుబాటులోకి
చైనా సహా పలు దేశాల్లో కొవిడ్ కేసులు పెరుగుతూ కలకలం చెలరేగుతున్న నేపథ్యంలో
కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. దేశీయ దిగ్గజ ఔషధ తయారీ
సంస్థ ‘భారత్ బయోటెక్’ అభివృద్ధి చేసిన నాసికా టీకాను 18 ఏళ్లు పైబడినవారికి
బూస్టర్ డోసుగా అందించేందుకు తాజాగా అనుమతి మంజూరు చేసింది. చైనా సహా పలు
దేశాల్లో కొవిడ్ కేసులు పెరుగుతూ కలకలం చెలరేగుతున్న నేపథ్యంలో కేంద్ర ఆరోగ్య
మంత్రిత్వ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. దేశీయ దిగ్గజ ఔషధ తయారీ సంస్థ ‘భారత్
బయోటెక్’ అభివృద్ధి చేసిన నాసికా టీకాను 18 ఏళ్లు పైబడినవారికి బూస్టర్
డోసుగా అందించేందుకు తాజాగా అనుమతి మంజూరు చేసింది. ఇప్పటికే కొవాగ్జిన్ లేదా
కొవిషీల్డ్ వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకున్నవారు దీన్ని పొందొచ్చు.
ప్రస్తుతానికి ప్రైవేటు ఆసుపత్రుల్లో మాత్రమే ఈ నాసికా టీకా అందుబాటులో
ఉంటుంది. జాతీయ కొవిడ్ వ్యాక్సినేషన్ కార్యక్రమంలో త్వరలోనే దాన్ని
ప్రవేశపెట్టే అవకాశాలున్నాయని అధికార వర్గాలు వెల్లడించాయి.
భారత్ బయోటెక్‌కు చెందిన నాసికా టీకాను ‘బీబీవీ154’గా పిలుస్తారు.
‘ఇంకొవాక్’ అనేది దాని బ్రాండ్ పేరు. కరోనాపై పోరులో ఇది చాలా సమర్థంగా
పనిచేస్తున్నట్లు ప్రయోగ పరీక్షల్లో తేలింది. 18 ఏళ్లు పైబడినవారిలో
హెటిరోలోగస్ బూస్టర్ డోసుగా అత్యవసర పరిస్థితుల్లో దాని పరిమిత స్థాయి
వినియోగానికి భారత ఔషధ నియంత్రణ జనరల్ (డీసీజీఐ) ఈ ఏడాది నవంబరులోనే ఆమోద
ముద్ర వేసింది. తాజాగా దాని వినియోగానికి కేంద్ర ప్రభుత్వ అనుమతి లభించడంతో
‘టీకాలపై జాతీయ సాంకేతిక సలహా బృందం (ఎంటాగీ)’ ఛైర్మన్ డాక్టర్
ఎన్.కె.అరోరా స్పందించారు. ‘‘వ్యాక్సిన్ల అభివృద్ధి రంగంలో భారత పరిశోధన,
అభివృద్ధి సామర్థ్యాలకు భారత్ బయోటెక్ నాసికా టీకా మరో ఉదాహరణ. సూది అవసరం
లేకుండానే దీన్ని సులభంగా తీసుకోవచ్చు. శ్వాసకోశ వైరస్లు శ్వాసనాళం ద్వారా
శరీరంలోకి ప్రవేశిస్తాయి. శ్వాసనాళంలో వైరస్‌ను అడ్డుకునేలా ఇంకొవాక్ మెరుగైన
రోగనిరోధక శక్తిని కలుగజేస్తుందని పేర్కొన్నారు.