న్యూఢిల్లీ : దేశంలో 6వ ‘వందే భారత్’ రైలు పట్టాలెక్కింది. మహారాష్ట్ర
పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోడీ జెండా ఊపి వందే భారత్ రైలును
ప్రారంభించారు. అనంతరం నాగ్‌పుర్ తొలిదశ మెట్రోను ప్రారంభించిన ప్రధాని
నరేంద్ర మోడీ రెండో దశ పనులకు పునాదిరాయి వేశారు. తర్వాత నాగ్‌పుర్
ఎయిమ్స్‌ను ప్రారంభించి జాతికి అంకితం చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ
షార్ట్‌కట్ రాజకీయాలతో దేశాభివృద్ధి జరగదని ప్రధాని నరేంద్ర మోడీ తెలిపారు.
తప్పుడు వాగ్దానాలతో అధికారాన్ని చేజిక్కించుకోవడం పట్ల ప్రజలు అప్రమత్తంగా
ఉండాలని ఆయన కోరారు. మహారాష్ట్ర పర్యటనలో ఉన్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ
వివిధ ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. దేశంలో ఆరో వందే
భారత్ రైలుకు శ్రీకారం చుట్టారు. నాగ్‌పుర్ నుంచి ఛత్తీస్‌గఢ్‌లోని
బిలాస్‌పుర్ మధ్య సేవలందించే ఈ రైలును నాగ్‌పుర్ రైల్వేస్టేషన్లో జెండా ఊపి
ప్రారంభించారు. మరోవైపు రూ.590 కోట్లతో నాగ్‌పుర్, రూ.360 కోట్లతో అజ్ని
రైల్వేస్టేషన్ల అభివృద్ధి పనులకు పునాది రాయి వేశారు. వీటితో పాటు మరిన్ని
ప్రాజెక్టులను ప్రధాని నరేంద్ర మోడీ జాతికి అంకితం చేశారు.గతంలో పన్ను
చెల్లింపుదారుల సొమ్ము అవినీతి, ఓటుబ్యాంకు రాజకీయాలతో వృథా అయ్యేది. గత
ఎనిమిదేళ్లలో మౌలిక సదుపాయాల అభివృద్ధికి కృషి చేశాం. షార్ట్‌కట్ రాజకీయాలతో
దేశాభివృద్ధి జరగదు. దేశానికి షార్ట్‌కట్ రాజకీయాలు అవసరం లేదు. కొన్ని రాజకీయ
పార్టీలు దేశ ఆర్థిక వ్యవస్థను నాశనం చేసేందుకు ప్రయత్నిస్తున్నాయి. తప్పుడు
వాగ్దానాలతో అధికారాన్ని చేజిక్కించుకోవడం పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని
ప్రధాని నరేంద్ర మోడీ సూచించారు.