హాజరైన మమత, జగన్, చంద్రబాబు
న్యూ ఢిల్లీ : వచ్చే ఏడాది భారత్లో జరగనున్న జీ-20 శిఖరాగ్ర సమావేశానికి సూచనల
కోసం ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన సోమవారం అఖిలపక్ష భేటీ జరిగింది. ఈ
సమావేశానికి బంగాల్ సీఎం మమత, ఏపీ సీఎం జగన్, తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు
హాజరయ్యారు. మరోవైపు బీజేపీ పదాధికారుల సమావేశాన్ని ప్రధాని నరేంద్ర మోడీ
ఢిల్లీలో ప్రారంభించారు. 2024 సార్వత్రిక ఎన్నికలకు పార్టీని సమాయత్తం చేసే
దిశగా ఈ సమావేశం జరిగింది.