దేశ రాజధాని ఢిల్లీలో గాలి నాణ్యత రోజురోజుకూ క్షీణించిపోతున్ననేపథ్యంలో
అక్కడి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాజధాని పరిధిలో భవన నిర్మాణాలు,
కూల్చివేతలపై తాత్కాలిక నిషేధం విధించింది. తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు
నిషేధం అమల్లో ఉంటుందని అధికారులు వెల్లడించారు. అయితే, అత్యవసర ప్రాజెక్టు
నిర్మాణాలకు మినహాయింపునిచ్చారు. గత నెలలో రాజధాని ప్రాంతంలో గాలి స్వచ్ఛత
రికార్డు స్థాయిలో క్షీణించి పోవడంతో భవంతుల నిర్మాణం, కూల్చివేతలపై నిషేధం
విధించాల్సిందిగా కేంద్ర ఎయిర్ క్వాలిటీ ప్యానెల్ అక్కడి అధికారులకు
సూచించింది. దీన్ని అమలు చేయడంతో రోజుల వ్యవధిలోనే గాలి నాణ్యత మెరుగుపడింది.
దీంతో అధికారులు నిబంధనలు ఎత్తివేశారు. అయితే, తాజాగా మరోసారి గాలి నాణ్యత
పడిపోవడంతో తిరిగి ఆ నిబంధనలు అమలు చేయనున్నట్లు తాజాగా వెల్లడించారు.